/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ipl-2024-jpg.webp)
IPL 2024 : సార్వత్రిక ఎన్నికలు(General Elections), పండుగల నేపథ్యంలో ముందు కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేసింది. ఎలక్షన్ కమిషన్(Election Commission) ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత, బోర్డు ఐపీఎల్(IPL) పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ పండుగల కారణంగా మరో రెండు మ్యాచ్‌ల తేదీలను రీ షెడ్యూల్ చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 17న జరగాల్సిన కోలకత్తా నైట్ రైడర్స్(KKR), రాజస్థాన్ రాయల్స్(RR) మ్యాచ్‌ను ఒక రోజు ముందు జరిపింది. దీంతో ఈ మ్యాచ్ ఏప్రిల్ 16న జరగనుంది. అలాగే ఏప్రిల్ 16న జరగాల్సిన గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను ఒకరోజు వాయిదా వేసి...ఏప్రిల్ 17న నిర్వహిస్తామని ప్రకటించింది.
BCCI also postpones IPL match between Gujarat Titans and Delhi Capitals in Ahmedabad from April 16 to April 17
— Press Trust of India (@PTI_News) April 2, 2024
శ్రీరామ నవమే కారణం..
అయితే ఈ రెండు మ్యాచ్‌లను ఇటుదిటు...అటుదిటు చేయడానికి మాత్రం బీసీసీఐ నిర్ధిష్ట కారణాలు చెప్పలడం లేదు. శ్రీరామ నవమి రోజున ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ మ్యాచ్ జరుగుతున్న కారణంగా...కోలకత్తా అధికారులు భద్రత కల్పించడంలో సందేహించారని తెలుస్తోంది.ఫ్రాంచైజీలు, బెంగాల్ క్రికెట్ సంఘం, బ్రాడ్‌కాస్టర్స్, ఇతర స్టేక్‌హోల్డర్స్‌కు బోర్డు దీని గురించి సమాచారం అందించింది. బిసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోల్‌కతా, పోలీసులతో పూర్తి చర్చలు జరిపాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Also Read : Delhi : ఫార్చ్యునర్ కారు కట్నంగా ఇవ్వలేదని భార్యను చంపేసిన భర్త