BCCI: జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్!

జూలైలో జింబాబ్యేతో జరిగే T20 సిరీస్‌ కు యువ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 5 మ్యాచ్ లకు యంగ్ బ్యాట్స్ మెన్ శుభ్‌మాన్ గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చింది.

New Update
BCCI: జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్!

India Tour Of Zimbabwe: జూలైలో జింబాబ్యేతో జరిగే 5 - T20 సిరీస్‌ లకు యువ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇరుజట్ల మధ్య జులై 6 నుంచి 14 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుండగా.. యంగ్ బ్యాట్స్ మెన్ శుభ్‌మాన్ గిల్ కు (Ꮪhubman Gill) నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చింది. జూలై 6న హరారే మ్యాచ్ తో ఈ సిరీస్ మొదలుకానుంది.

జట్టు: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (WK), ధ్రువ్ జురెల్ (WK), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.

షెడ్యూల్:
తొలి టీ20 (జులై 6)
రెండో టీ20 (జులై 7)
మూడో టీ20 (జులై 10)
నాలుగో టీ20 (జులై 13)
ఐదో టీ20 (జులై 14)
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతాయి.

Also Read: ఐటీ రిటర్న్స్ గడువులోగా వేయకపోతే ఏం జరుగుతుంది? 

Advertisment
Advertisment
తాజా కథనాలు