Telangana : తెలంగాణ(Telangana) లో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఓ అధ్బతమైన అవకాశం లభించింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కోచింగ్ సెంటర్లలో లక్షల్లో ఫీజులు కట్టి తిప్పలు పడుతున్న నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రూప్ 1(Group-1) అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్థికంగా వెనకబడిన వారికి తమవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది.
మార్చి 8 నుంచి ఉచిత శిక్షణ..
ఈ మేరకు గ్రూప్-1 పోస్టులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మార్చి 8 నుంచి ఉచిత శిక్షణ అందించబోతున్నట్లు తెలిపింది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించని అభ్యర్థులు ఈ నెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డీ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్ లోని సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్(BC Study Circle) లో ఈ శిక్షణ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana: నాకు అహంకారం లేదు.. అందరినీ కలుస్తా
గొప్ప వరం..
ఇక గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం ఉచిత కోచింగ్(Free Coaching) కు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 040-24071178, 27077929 నంబర్లకు కాల్ చేసి తమను సంప్రదించాలని సూచించారు. కాగా ఈ అవకాశం పేద అభ్యర్థులకు గొప్ప వరంగా మారనుంది. త్వరలోనే ఎగ్జామ్స్ నిర్వహించనుండగా స్టడీ సర్కి ల్ భారీ ఊరట కలిగించింది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.