UPSC: సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగింపు!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగించినట్లు ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారికంగా ప్రకటించింది. 2024-2025కు సంబంధించి 10 నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఇవ్వనుండగా జులై 31 వరకు అప్లికేషన్ గడువు పొడగించినట్లు డైరెక్టర్ ఏ.నరసింహ రెడ్డి తెలిపారు.