Telangana Congress: ప్రతి పార్లమెంట్‌కు రెండు సీట్లు ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్‌కు బీసీ నేతల డిమాండ్..

 ప్రతిపార్లమెంటుకు రెండు సీట్లు ఇవ్వవలసిందే అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) లో బీసీ నేతలు(BC Leaders) కోరుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, బీసీనేతలు నేరుగా ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి తమ వాదన వినిపించారు.

Telangana Congress: ప్రతి పార్లమెంట్‌కు రెండు సీట్లు ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్‌కు బీసీ నేతల డిమాండ్..
New Update

Telangana Congress BC Leaders: ప్రతిపార్లమెంటుకు రెండు సీట్లు ఇవ్వవలసిందే అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) లో బీసీ నేతలు(BC Leaders) కోరుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, బీసీనేతలు నేరుగా ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి తమ వాదన వినిపించారు. తెలంగాణ కాంగ్రెస్ లోని బీసీ ముఖ్యనేతలు కొందరు శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేని కలిశారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిష్టానాన్ని కలిసిన వారిలో మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, కత్తి వెంకటస్వామిలు ఉన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లా బీసీలకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తోంది. అందుకు తగ్గట్టే కార్యాచరణను సిద్ధం చేసోంది. పార్టీలోని ముఖ్య నేతలు వీహెచ్‌, మదుయాష్కీ, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పొన్నాల, పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ వంటి నేతలు బీసీ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా..ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. బీసీ నేతలు తమ వాటా కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండటంతో...కాంగ్రెస్‌ పార్టీలో అసెంబ్లీ సీట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సైతం, బీఆర్‌ఎస్‌ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో బీసీ నేతలకు టికెట్లు ఇవ్వటం కష్టంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరగడంతో, పలువురి నేతల టికెట్లు డైలామాలో పడిపోయాయి. ఇదే విషయాన్ని పార్టీలోని బీసీ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఇస్తే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచి పార్టీని నమ్ముకున్న నేతలకు టికెట్లు ఇవ్వకపోతే పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ ఇదే విషయమై చర్చించి ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కేటాయించాలని ఒత్తిడి చేశారు. ఇప్పటికే బీసీ నేతలు బలంగా పని చేసుకుంటున్న 40 నియోజకవర్గాల జాబితాను తయారు చేశారు. ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కాదని.. కొమ్మూరి ప్రతాపరెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. హుస్నాబాద్‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎల్బీనగర్ సీటుపై మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, నల్గొండ అసెంబ్లీ సీటుపై చెరుకు సుధాకర్ వంటి నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇవన్నీ చర్చకొస్తున్నాయి.

Also Read:

Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..!

#telangana-news #telangana #telangana-elections #telangana-politics #telangana-congress #t-congress-leaders
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe