Barrelakka: ఎంపీగా పోటీ చేస్తా: బర్రెలక్క సంచలన నిర్ణయం..

కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బర్రెలక్క ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని ఆర్టీవీతో తెలిపారు.

New Update
Barrelakka: ఎంపీగా పోటీ చేస్తా: బర్రెలక్క సంచలన నిర్ణయం..

Independent Candidate Barrelakka (Sirisha) : నాగర్‌కర్నూల్‌ (NagarKurnool) జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క(శిరీష) బరిలోకి దిగి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన బర్రెలక్క (Barrelakka).. ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపించలేకపోయింది. ఆమెకు సుమారు ఆరు వేల వరకే ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణరావు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తన ఓటమిపై బర్రెలక్క స్పందించారు.

తమ నియోజకవర్గంలో ప్రజలకు డబ్బులు పంచకున్నా కూడా నాకు ఓటు వేయడం చాలా సంతోషమని తెలిపారు. తనకు ఓటు వేసినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. నాకు వచ్చినవి స్పచ్ఛమైన ఓట్లని.. ఆరు వేల ఓట్ల వచ్చాయంటే నా దృష్టిలో నేను గెలిచినట్లేనని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బర్రెలక్క మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని మీడియాతో తెలిపారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: తెలంగాణ సీఎం ప్రకటన ఈ రోజు లేనట్లే!

Advertisment
తాజా కథనాలు