Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

మాజీ ప్రధాని షేక్ హసీనాకు ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెతో పాటూ మాజీ ఎంపీలందరికీ దౌత్య పాస్‌ పోర్ట్‌లను కాన్సిల్ చేసింది. దీంతో వీరందరూ కొన్ని దేశాలకు వెళ్ళలేరు. ఈ పాస్‌ పోర్ట్‌తోనే షేక్ హసీనా భారతదేశం వచ్చారు.

New Update
Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

Sheikh Hasina Passport Cancelled: షేక్ హసీనా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం. ఇప్పటికే అక్కడ ఆమె మీద పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరుతోంది. బంగ్లాలో చోటుచేసుకున్న హింసాకాండకు సంబంధించి హసీనాపై నమోదయిన హత్య అభియోగాల విచారణ జరిపేందుకు హసీనాను తమ దేశానికి అప్పగించాలని తాజాగా బీఎన్‌పీ సెక్రటరీ జనరల్‌ మీర్జా ఫఖ్రుల్‌ ఇస్లామ్‌ ఆలంగిర్‌ డిమాండు చేశారు. షేక్ హసీనాను న్యాయబద్ధంగా బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరారు. రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల్లో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణాలకు హసీనా, ఆమె అనుచరులపై 30కి పైగా కేసులు నమోదు అయ్యాయి.

ఇక మరోవైపు బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం షేక్ హసీనా మరి కొంత మంది ఎంపీల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసింది. దీని ద్వారా ఆమె ఎక్కడికీ వెళ్ళకుండా నిరోధించాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పాస్‌ పోర్ట్‌ కాన్సిల్ చేయడం వల్లన ఆమెకు దౌత్యపరంగా ప్రస్తుతంగా ఉన్న వెసులుబాట్లు లేకుండాపోతాయి. ఈ పాస్‌ పోర్ట్‌ వల్లనే షేక్ హసీనా భారతదేశం కూడా రాగలిగారు. ఇపుడు ఇది కాన్సిల్ అయితే ఇక్కడ కూడా ఆమె ఉండగలుగుతారో లేదో తెలియదు.

Also Read: Hyderabad: మరో పదిరోజుల్లో ఆర్ఆర్ఆర్ పరిహారం

Advertisment
తాజా కథనాలు