Bangladesh Ex Prime Minister: రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం నేరుగా కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చారు. అయితే ఇక్కడ నుంచి ఆమె లండ్ వెళ్ళాలని ప్లాన్. కానీ అందుకు బ్రిటన్ గవర్నమెంట్ అంగీకరించలేదు. హసీనాకు తాము ఆశ్రయం ఇవ్వలేమంటూ సూచించినట్లు సమాచారం. ఈ మేరకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి ఆశ్రయం కల్పించడం కష్టతరమైన విషయంగా పేర్కొన్నట్లు అక్కడి జాతీయమీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రస్తుతం షేక్ హసీనా ఢిల్లీకి దగ్గరలో ఉన్న హిండస్ ఎయిర్ బేస్‌లో భారత అధికారుల రక్షణలో ఉన్నారు. ఆమెకు లండన్‌లో ఉండేందుకు వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో మరి కొన్ని రోజులు భారత్ లోనే ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. భద్రతా ఏజెన్సీలు ఇప్పటికే ఆమె రక్షణ కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్పారని వార్తలు వస్తున్నాయి. జాతీయ భద్రతాసలహాదారు అజి దోవల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే విశాలమైన, సురక్షితమైన ప్రదేశానికి షేక్ హసీఆను మారుసతారని చెబుతున్నారు. భారత్ ప్రధాని లేదా ఇతర దేశాల అధినేతలకు ఇచ్చే ప్రోటోకాల్‌నే మెకు కూడా పాటించనున్నారని సమాచారం.
షేక్ హసీనా భారత్ లో దీర్ఘకాలం ఉండేందుకు తగ్గ ఏర్పాట్ల కోసం వైమానిక దళం, భద్రతా సంస్థలు ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి సఫ్దర్ జంగ్, పాలం విమానాశ్రయాల వరకు ప్రత్యేక కసరత్తు నిర్వహించాయి. ఆమె అంతర్గత భద్రత కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) కమాండోలను మోహరించినట్లు, వైమానిక దళానికి చెంది గరుడ్ కమాండోలు హిండన్ ఎయిర్ బేస్ బయట భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read:Paris Olympics: చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగట్..ఫైనల్స్‌లోకి ఎంటర్