Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ! అసెంబ్లీలో భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్టా లేక అప్పుల పత్రమా? అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఎగతాళి చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమన్నారు. హామీల అమలు కాంగ్రెస్‌కు చేతకాదని బడ్జెట్ చూస్తే తెలుస్తోందన్నారు. By srinivas 25 Jul 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్టా లేక అప్పుల పత్రమా అంటూ ఎగతాళి చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని ఆరోపిస్తున్న సీఎం, మంత్రులు.. రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క నియోజకవర్గం పేరు లేనందుకు రాజీనామా చేస్తారా అంటూ తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు. ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: బీజేపీ నేతలు చెబితేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.. భట్టి సంచలన ఆరోపణలు! ఇన్‌కమ్ కోసం ప్రభుత్వ భూములమ్ముతారా.. ఈ మేరకు బండి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఐదేళ్లలో అమలు చేయడం అసాధ్యం అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదని, గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ఆదాయం ఎలా సమకూర్చుకుంటారో ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించలేదని, ఇన్‌కమ్ కోసం ప్రభుత్వ భూములన్నీ అమ్మాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. హామీల అమలు కాంగ్రెస్‌కు చేతకాదని బడ్జెట్ చూస్తే తెలుస్తోందన్నారు. హిందువుల పండుగలకు పైసా ఇవ్వకపోవడం మతతత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్నారు. #congress #bjp #bandi-sanjay #telangana-budget-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి