కేసీఆర్ మిస్సింగ్.. ఏ క్షణమైనా బీఆర్ఎస్ చీలే ప్రమాదం: బండి సంజయ్ సంచలన వాఖ్యలు

Bandi Sanjay: కాళేశ్వరంపై కాంగ్రెస్ డ్రామాలు.. కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలు: బండి సంజయ్
New Update

ప్రధానమంత్రి రెండ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ అభివ్రుద్ది కోసం రూ.20 వేల కోట్లకుపైగా కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. దీంతోపాటు 9 ఏళ్లలో తెలంగాణ కోసం రూ.9 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తూ అనేక అభివ్రుద్ది, సంక్షేమ ఫథకాలను అమలు చేస్తున్నారన్నారు. యావత్ ప్రపంచం మోదీ పట్ల సానుకూలతతో ఉందన్న బండి సంజయ్...ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు తలెత్తుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల్లో మోదీకి పెద్ద ఎత్తున వస్తున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని బండి ఆరోపించారు. ప్రధాని గౌరవాన్ని తగ్గించేలా చిల్లరగా మాట్లాడుతున్నారంటూ బండి ఫైర్ అయ్యారు. తెలంగాణపట్ల మోదీ విషయం చిమ్ముతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ముఖ్యంగా ట్విట్టర్ టిల్లు (కేటీఆర్) నిలువెల్లా విషం నింపుకున్నడని.... మోదీపై విషం చిమ్ముతున్నాడని.. తెలంగాణలో అభివ్రుద్ది పనులకు నిధులు కేటాయిస్తే కూడా విషం చిమ్మడం అవుతుందా? అంటూ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: చీటర్ మోదీ కాదు మీ అయ్య: కేటీఆర్ పై ఈటల ఇంకా ఏమన్నారంటే?

తెలంగాణయే మా కుటుంబమని చెబుతున్న అజయ్ రావు… దళితుడిని సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు చేయలేదు? ప్రశ్నించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు లాభం చేయడం లేదు? మీ కుటుంబంలోని 4గురికే పదవులు, డబ్బులు పంచుకుంటున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ భాగోతాన్ని మోదీ బట్టబయలు చేయడంతో బీఆర్ఎస్ లో గుబులు పట్టుకుందన్నారు బండి. సీఎం కుటుంబంలో చిచ్చు రేగిందని... సడ్డకుడి కొడుకు సంతోష్ రావును కేసీఆర్ దగ్గరికి రానీయడం లేదన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలనే విషయం బయట పడటంతో బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారన్నారు.

ఎందుకంటే ట్విట్టర్ టిల్లు భాషను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయం వారికి అర్ధమైందన్నారు. కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళితే ప్రజలు ఓడిస్తారనే భయం బీఆర్ఎస్ నేతలకు పట్టుకుందన్న బండి సంజయ్... రాజకీయ భవిష్యత్ గురించి చర్చించుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా నిట్టనిలువునా చీలే ప్రమాదం ఉందని బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది బీజేపీవైపు చూస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. మోదీని తిట్టాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ ట్రైనింగ్ ఇస్తున్నాడని తెలిసింది. మేం తిట్టడం మొదలు పెడితే బయటకు కూడా రాలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

పొరపాటును మళ్లీ బీఆర్ఎస్ కు అధికారంలోకి వస్తే తెలంగాణను పూర్తిగా లూటీ చేస్తారని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందువులపట్ల చులకన భావం ఉందన్నారు . కరీంనగర్ లో మసీదుకు 8 ఎకరాలు కేటాయించి… మందిరానికి 5 ఎకరాలే ఎట్లా కేటాయిస్తారు? అంటూ ప్రశ్నించారు. కరీంనగర్ లోని మసీదుల అభివ్రుద్ధికి పెద్ద ఎత్తున నిధులిస్తున్న ప్రభుత్వం… శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు ఎందుకు నిధులు కేటాయించడం లేదు? దూపదీప నైవేద్యాలకు పైసలెందుకు ఇవ్వడం లేదు? మసీదుకు నిధులివ్వడంలో మాకు అభ్యంతరం లేదు… కానీ దేవాలయాలకు ఎందుకు ఇవ్వడం లేదనేదే నా ప్రశ్న అన్నారు బండి సంజయ్.

ఇది కూడా చదవండి: ఎన్డీఏలోకి వస్తానంటే వద్దన్నా.. కేటీఆర్ ను ఆశీర్వదించమంటే నో చెప్పా.. కేసీఆర్ టాప్ సీక్రెట్స్ రివీల్ చేసిన మోదీ

ఇది మాట్లాడితే మతతత్వమైతదా? నేను మాట్లాడకపోతే… మసీదులకు 8 ఎకరాలే కాదు.. వంద ఎకరాలిచ్చినా ఆశ్చర్యం లేదు.. నేను వాస్తవాలు మాట్లాడుతుంటే… కొందరు ముస్లిం పెద్దలతో కలిసి బండి సంజయ్ కు ఓటేయొద్దని మాట్లాడిస్తారు… అయినా భయపడను. వాస్తవాలు మాట్లాడుతూనే ఉంటా. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేసిన తరువాత ముస్లిం మహిళలు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్నారు..వాస్తవాలు మాట్లాడితే చేతగాని ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు… మా ఇంటిపైకి, ఆఫీస్ పైకి దాడి చేయించడానికి వస్తున్నారు. మేం భయపడేటోళ్లం కాదు… బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి గెలవలేక ఎంఐఎంకు డబ్బులిచ్చి వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నరు. మీరు రెచ్చిపోతే ఊరుకునే పార్టీ బీజేపీ కాదు.. కరీంనగర్ లో బీజేపీ లేకపోతే… బీఆర్ఎస్ సపోర్ట్ తో ఎంఐఎం కరీంనగర్ మొత్తాన్ని కబ్జా చేసి అరాచకాలకు పాల్పడే ప్రమాదముంది. ప్రజలంతా ఆలోచించాలని కోరుతున్నాను అంటూ బండి సంజయ్ అన్నారు.

#ktr #kcr #bjp #bandi-sanjay #mp-bandi-sanjay #bandi-sanjay-comments-on-brs #bra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe