MP Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిరాశ పరిచిన లోక్ సభ ఎన్నికలపై (Lok Sabha Elections) ఫోకస్ పెట్టింది బీజేపీ (BJP) హైకమాండ్. ప్రజలకు దగ్గరయేందుకు ఈరోజు నుంచి సంకల్ప యాత్ర పేరుతో యాత్ర చేపట్టింది బీజేపీ. ఈ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య చీకటి ఒప్పందం నడుస్తోందని ఆరోపణలు చేశారు.
ALSO READ: జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు!
చెప్పుతో కొట్టండి..
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తులో ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు బండి సంజయ్. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉందని ఎవరైనా అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పొత్తు పెట్టుకోలేదని.. అలాంటిది తెలంగాణలో ఓడిపోయినా బీఆర్ఎస్ పార్టీతో ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు ఈ ప్రచారమే ఈ పొత్తు అని అన్నారు.
కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ కాలేదు..
అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు బండి సంజయ్. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేదు? అని అడిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందని ఆరోపణలు చేశారు.
బీజేపీకి రాముడున్నాడు..
బీజేపీకి రాముడున్నాడు…మోడీఉన్నాడు… కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రాక్షసులున్నారని అన్నారు బండి సంజయ్. 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోడీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ ఇద్దామని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బతికున్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని బండి పేర్కొన్నారు. హిందుత్వం మాట్లాడలేనినాడు రాజకీయాల నుండి తప్పుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.