Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే.. బండి సంజయ్ బహిరంగ లేఖ! మీకోసం ప్రజాహిత యాత్రనై వస్తున్నా ఆశీర్వదించండంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని ఫైర్ అయ్యారు. ఎంపీగా ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చానని చెప్పారు బండి. By Trinath 09 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bandi Sanjay Open Letter to Karimnagar Public: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ (BRS) పార్టీ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను నిండా ముంచితే, ఆశలు కల్పిస్తూ హడావుడి చేయడమే తప్ప కాంగ్రెస్ (Congress) చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ రెండు కుటుంబ పార్టీలేనని ఫైర్ అయ్యారు. ఆ చీడను వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ హితం కోసం అబ్‌కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ (Modi Govt) సర్కార్ నినాదంతో... మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకై జరుగుతున్న ఈ మహాయాగంలో మరోసారి సమిధగా మారడానికి కరీంనగర్ బిడ్డ సిద్ధమయ్యాడని చెప్పుకొచ్చారు బండి. మీ చేతిలో రెపరెపాలాడే కాషాయ జెండాగా మారడానికి, మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా (Prajahitha Yatra) మీ గడపకొస్తున్నానని తెలిపారు. ఆశీర్వదించండంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. BANDI SANJAY OPEN LETTER రేపే స్టార్ట్: రేపటి నుంచి ప్రజాహిత యాత్ర ప్రారంభం కానుండడంతో యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ ప్రజలకు లేఖలో విజ్ఞప్తి చేశారు. రేపు ఉదయం కొండగట్టు (Kondagattu) అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రారంభమయ్యే తొలివిడత యాత్ర నుంచి ఈనెల 15 వరకు కొనసాగనుంది. తొలిరోజు మేడిపల్లి, కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడ, బొమ్మెన, దూలూరు, సరికొండ, కథలాపూర్ గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి కథలాపూర్ లో బండి సంజయ్ బసచేస్తారు. తొలివిడత ప్రజాహిత్రలో సిరిసిల్ల (Sircilla), వేములవాడ (Vemulawada) నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్రను కొనసాగించనున్నారు. ఆయా మండలాల్లో వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకునేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. టార్గెట్ కాంగ్రెస్? కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. అదే సమయంలో గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజాహిత యాత్ర ద్వారా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. గల్లీలో ఎవరున్నా దేశ రక్షణ, ప్రజల అభ్యున్నతి కోసం మరోసారి కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ మళ్లీ ఏర్పడాల్సి ఉందనే నినాదాన్ని కూడా ప్రజాహిత యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంకల్పించారు. Also Read: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న! WATCH: #pm-modi #bjp #bandi-sanjay #karimnagar #prajahitha-yatra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి