Telangana: కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు ప్రజల్లో మంచి పేరున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని, బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. అయితే హరీష్ బీజేపీలోకి వస్తే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రావాలని సూచించారు.
ఈ మేరకు బండి సంజయ్ మాట్లాడుతూ.. హరీష్ రావు మంచి పొలిటిషియన్. పేరున్న వ్యక్తి బీజేపీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామన్నారు. ఏ రాజకీయ నాయకుడైన పొలైట్ గా ఉండాలన్నారు. ఇక కేసీఆర్ కథ అడ్డం తిరిగిందని, ఒకప్పుడూ అహంకారంతోని బీజేపీని కించపరుస్తూ ఎంత పార్టీ అంటూ మాట్లాడిన కామెంట్స్ ను గుర్తు చేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చాలా టెన్సన్ లో ఉన్నాడని, అతన్ని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని కోరారు. పెద్దాయన రందిలో ఉన్నారని, హరీష్ రావు బీజేపీలో చేరుతున్నారని తెలిస్తే పిడాత.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ను చూసి గుణపాఠం నేర్చుకోవాలన్నారు. కేసీఆర్ తరహాలోనే వ్యవహరిస్తే ప్రజలు బొంద పెడతారన్నారు.