Bandi Sanjay: రాష్ట్రంలో దద్దమ్మ సర్కార్‌ పాలన కొనసాగుతోంది

సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని దద్దమ్మ కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌ పరీక్షల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయన్నారు.

Bandi Sanjay: రాష్ట్రంలో దద్దమ్మ సర్కార్‌ పాలన కొనసాగుతోంది
New Update

సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని దద్దమ్మ కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌ పరీక్షల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన టెట్‌ పరీక్షల్లో ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం అందజేసి నిరుద్యోగులు తీవ్ర మానసిక క్షోభ అనుభవించేలా చేశారన్నారు. ఇది క్షమించరాని నేరమన్న బండి సంజయ్‌.. రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించరాని దద్దమ్మ సర్కార్‌ కొనసాగుతుండడం బాధాకరమన్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహించిన టెన్త్‌ ప్రశ్నాపత్రం పేపర్‌ లీకేజీ అయిందని, ఇంటర్‌ ప్రశ్నాపత్రం కూడా లీకేజీ అయిందన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాన్ని వారు ఏం చేశారో అధికార పార్టీ నేతలకే తెలవాలన్నారు. విద్యార్థుల ఎగ్జామ్స్‌ సరిగ్గా నిర్వహించలేని నాయకులు.. విపక్షాలపై మాత్రం బురద చల్లడానికి రేడీగా ఉంటారన్నారు. టీఎస్పీఎస్సీ, టెన్త్‌ పేపర్‌ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని బండి సంజయ్‌ ఆరోపించారు.

మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల కమలాకర్‌ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని బండి సంజయ్ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. కాగా బండి సంజయ్‌ అఫిటవిట్‌కు సంబంధించిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరిగింది. కాగా దీనిని హై కోర్టు ఈ నెల 20న విచారణ చేపట్టనుంది. గత ఎన్నికల్లో గంగుల కమలాకర్‌ తన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించలేదని, అంతే కాకుండా ఎన్నికల ఖర్చును కూడా తక్కువగా చూపారని బండి సంజయ్‌ ఆరోపించారు.

#brs #ktr #high-court #bjp #bandi-sanjay #cm-kcr #tet-exams #gangala-kamalakar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe