Bandi Sanjay Demand : కేసీఆర్ (KCR) చర్యలు ప్రజాస్వామ్యానికే అవమానం అని అన్నారు బండి సంజయ్ (Bandi Sanjay). బీఆర్‌ఎస్ (BRS) పాలనలో ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ, మానవ హక్కుల ఉల్లంఘన అని ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు, తమ అనుచరుల ట్యాపింగ్‌తో కేసీఆర్‌కు బీజేపీపై ఉన్న భయం ఇప్పుడు బయటపడిందని.. పోలీసుల విచారణలో రాధా కిషన్‌రావు ఒప్పుకోలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలే నిజం అయ్యాయని అన్నారు.
లిక్కర్ స్కామ్ (Liquor Scam) లో ఇరుక్కున్న తన సొంత కూతురిని కాపాడుకునేందుకు కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోలు కేసును క్విడ్ ప్రోకోగా రూపొందించాలని భావిస్తున్నట్లు ఇప్పుడు స్పష్టమవుతోందని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా కేసీఆర్ చట్టానికి ద్రోహం చేయడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాశారుని విమర్శించారు. నిజానికి, ఎమ్మెల్యే పదవితో సహా రాజ్యాంగబద్ధమైన ఏ పదవికీ ఆయన అనర్హుడని, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్‌తో పాటు, BRS పార్టీ నుండి ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కు పాల్పడిన వారందరినీ ప్రాసిక్యూట్ చేసి, వారి పదవుల నుండి ప్రజా ప్రతినిధులుగా తొలగించాలని డిమాండ్ చేశారు. BRS సభ్యత్వాన్ని నిషేధించడం గురించి కూడా ఆలోచించడం అత్యవసరం అని అన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును అమెరికా నుంచి ఎందుకు తీసుకురాలేదు?, అతని అరెస్టు BRS ప్రభుత్వం అవినీతి విధానాల గురించి మరిన్ని వాస్తవాలను బహిర్గతం చేయగలదు అని అన్నారు. కేసీఆర్‌ను తక్షణమే అరెస్టు చేసి విచారించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే.. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సీబీఐకి లేఖ రాయాలి. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ అనర్హుడని శాసనసభ స్పీకర్ ప్రకటించాలి.
Also Read : నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. ఎన్టీఆర్ లాంటివారు!