Bandi Sanjay : బీఆర్‌ఎస్ అంటే బ్రష్టాచార్‌ రాష్ట్ర సమితి: బండి సంజయ్

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతులు నాశనమవుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందని విమర్శించారు.

New Update
Bandi Sanjay : బీఆర్‌ఎస్ అంటే బ్రష్టాచార్‌ రాష్ట్ర సమితి: బండి సంజయ్

Bandi Sanjay Comments on BRS: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో(Lok Sabha) మాట్లాడిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత పేరు ఖాసిం చంద్రశేఖర్ రజ్వీ అంటూ విమర్శలు గుప్పించారు. బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, ఇక్కడి కాంగీ, తెలంగాణ కేడీ అవిశ్వాసం ఎందుకు పెట్టారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందన్నారు. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆస్తులు 400 రెట్లు పెరిగాయన్నారు. డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పేరుతో ప్రజలను పీక్కుతింటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1400మంది చనిపోయారన్నారు. బీఆర్ఎస్‌కు తెలిసింది ఏంటంటే రాత్రంతా తాగడం, ఉదయం పడుకోవడం, ఎవరినీ కలవకపోవడమని బండి ఎద్దేవా చేశారు.

ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లలేదని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారని.. మరి తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు చనిపోతే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో బలం లేదని.. గ్రేటర్‌ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడులో జరిగిన ఉపఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్నారు. రాహుల్ గాంధీని చూస్తే గజిని గుర్తుకువస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చొర్రినట్లు.. మా తెలంగాణలో ఓ కుటుంబం చేరిందని సంజయ్ తెలిపారు. బీఆర్‌ఎస్ భారత్‌ రాష్ట్ర సమితి కాదు.. బ్రష్టాచార్‌ రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. 24గంటల కరెంట్‌ ఇస్తున్నారని చెబుతున్నారని.. అది నిజమని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయి అని సంజయ్‌ ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజలకు ఒకటే చెబుతున్నా కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ ఒక్కటే అని తెలిపారు. నమస్తే సదావత్సలే మాతృభూమి.. త్వయా హిందు భూమే సుఖం వర్దీతో హమ్..  భారత్ మాతా కీ జై అంటూ ఆవేశంగా ప్రసంగించారు.

Also Read: అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ధన్యవాదాలు: మోదీ

Advertisment
తాజా కథనాలు