Balakrishna : 64 ఏళ్ళ వయసులో బాలయ్య విన్యాసాలు.. ఆయన ఇంకా కుర్రాడే అంటున్న నెటిజన్లు!

ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య ఓ వాహనంపై నుంచి మరో వాహనంపై ఒక్కసారిగా దూకాడు. 64 ఏళ్ళ వయసున్న బాలయ్య ఇలా ఒక వాహనంపై నుంచో మరో వాహనంపై అవలీలగా దూకడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

New Update
Balakrishna : 64 ఏళ్ళ వయసులో బాలయ్య విన్యాసాలు.. ఆయన ఇంకా కుర్రాడే అంటున్న నెటిజన్లు!

Nandamuri Balakrishna Jumping Video Viral : తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఓ వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు హిందూపురం MLA గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు బాలయ్య. ఏపీలో ఎన్నికలు(Elections) ఉండటంతో బాలయ్య ప్రస్తుతం షూటింగ్స్ కాస్త పక్కన పెట్టి టీడీపీ ప్రచారంలో పాల్గొంటున్నాడు. అయితే ఈ ప్రచారంలో భాగంగా బాలయ్య చేసిన ఓ పని నెట్టింట వైరల్ గా మారింది.

64 ఏళ్ళ వయసులో బాలయ్య విన్యాసాలు

ప్రచారంలో భాగంగా బాలయ్య ఓ వాహనంపై నుంచి మరో వాహనంపై ఒక్కసారిగా దూకాడు. అది చుసిన కార్యకర్తలు షాక్ కి గురయ్యారు. 64 ఏళ్ళ వయస్సు ఉన్న బాలయ్య ఇలా ఒక వాహనంపై నుంచో మరో వాహనంపై అవలీలగా దూకడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చుసిన నెటిజన్స్, ఫ్యాన్స్ బాలయ్య పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. " 64 ఏళ్ళ వయస్సు ఉన్న బాలయ్యలో ఇంకా కుర్రతనం అలాగే ఉందని" కొందరు అంటుంటే.." ఏ ఏజ్ లోనైనా సాహసం చేయాలంటే బాలయ్య తర్వాతే" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని సోషల్ మీడియా(Social Media) మాధ్యమాల్లో తెగ షేర్ చేస్తున్నారు.

ఎలక్షన్స్ తర్వాతే షూటింగ్

ప్రస్తుతం బాలయ్య ఎన్నికల ప్రచారం(Election Campaign) తో బిజీగా ఉన్నాడు. ఎలక్షన్స్ పూర్తయ్యాకే తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ప్రెజెంట్ ఆయన బాబీ దర్శకత్వంలో 'NBK109' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని జూన్ లేదా జూలై లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read : మహేష్ బాబుది విగ్గా? ఒరిజినల్ హెయిరా?.. ఒక్క వీడియోతో క్లారిటీ వచ్చేసిందిగా!

Advertisment
తాజా కథనాలు