Ayodhya Ram : దేశ హిందువుల 500 ఏళ్ల నాటి కల సాకారం అయింది. అయోధ్య(Ayodhya) లో రామాలయ నిర్మాణం పూర్తైంది. తన జన్మస్థలంలో రామ్‌లలా(Ram Lalla) కొలువుదీరారు. అద్భుతమైన రూపంలో ఉన్న బాలరాము(Bala Rama) డిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయోధ్య వైపు అడుగులు వేశారు. ప్రధాని మోదీ(PM Modi) సహా దేశంలోని ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రారంభానికి ముందే అయోధ్య బాల రాముడి రూపం సోషల్ మీడియా లో దర్శనమిచ్చింది. ఒంటినిండా ఆభరణాలతో అలంకరించిన ఫొటో మీడియా మొత్తం చక్కెర్లు కొట్టింది. అయితే తాజాగా ఒక ఏఐ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇది కూడా చదవండి: కలబందలో విషపూరితమైనవి ఉంటాయా?.. ఇంట్లో పెట్టుకుంటే అంతేనా?
బాలరాముడి విగ్రహ నమూనాతో కొందరు ఏఐ(AI) సాంకేతిక జోడించి ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రామ్‌లలా నిజంగానే తమను చూస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ప్రత్యక్షంగా మనిషిని చూసిన అనుభవం కలుగుతోంది. రామ్‌లలా(Ram Lalla) చిరునవ్వులు చిందిస్తూ కంటి రెప్పలు కొడుతూ తలను అటూఇటూ కదిలిస్తుంటే భక్తులంతా అలా కళ్లప్పగించి చూస్తూ పరవశించిపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్(Viral) గా మారింది. ఎవరి ఫోన్లలో చూసినా ఇదే వాట్సాప్ స్టేటస్‌గా ఉంది.
కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా అయోధ్య గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం ఫొటోలు, వీడియోలను ఎడిటింగ్ చేసి ఈ వీడియోను తయారు చేశారు. ఎవరు చేశారో తెలియనప్పటికీ ఈ వీడియో చూసిన భక్తులు మాత్రం సంతోషంలో మునిగిపోతున్నారు. కళ్ల ముందే అయోధ్య రామయ్య (Ayodhya Ramaiah) నిలువెత్తు రూపం చూసి తరిస్తున్నారు. అయోధ్య వెళ్లి రాముడిని చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ వీడియో చూస్తే అంతకు మించిన ఆనందం కలుగుతోందని కామెంట్లు చేస్తున్నారు. ఇంతటి గొప్ప వీడియోను తయారు చేసిన వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి: గర్భసంచి తొలగింపు తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి: క్యారెట్లను ఇలా తీసుకుంటే రోగనిరోధక శక్తి రెట్టింపు..ఇంకా ఎన్నో ప్రయోజనాలు