Hanuman: హనమాన్ మూవీ...టాలీవుడ్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తేజా సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ..టాలీవుడ్ లో ఓ సంచలనం క్రియేట్ చేసింది. పెద్ద హీరోల సినిమాలను పక్కకు తోసి సంక్రాంతికి మంచి కానుక అందించింది. ఇప్పటికే ఈ మూవీ 250కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ రిలీజ్ అయిన 15రోజులు దాటుతున్నా ఇంకా థియేటర్లు హౌస్ ఫుల్ గా ఉన్నాయి. ఇక ఈ మూవీని ఇప్పటివరకు చూడని చాలా మంది ఓటీటీలో రిలీజ్ అయితే చూద్దామని వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారికి నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే హనుమాన్ మూవీ ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.
ఈ మధ్య విడుదల అయిన చాలా సినిమాలు నాలుగు వారాలు గడవకముందే ఓటీటీలో దర్శనమిచ్చాయి. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా కేవలం 28రోజుల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే దీన్ని బట్టిచూస్తే జనవరి 12న విడుదల అయిన హనుమాన్ మూవీ ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీని ఓటీటీలోకి వచ్చేస్తుందని అంతా భావించారు. కానీ హనుమాన్ మూవీకి థియేటర్లలో వస్తున్న ఆదరణ చూసిన చిత్ర యూనిట్ ఇప్పుడే ఓటీటీలోకి రిలీజ్ చేయవద్దని డిసైడ్ అయ్యారట. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!!
అయితే ఈ మూవీని ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ మూవీ థియేటర్లోకి విడుదలైన 5 నుంచి 6 వారాల్లో ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ థియేటర్లో వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ మూవీ స్ట్రీమింగ్ వాయిదా వేస్తున్నట్లు సమాచారం. మార్చి రెండో వారంలో లేదంటే మార్చి 8వ తేదీని మహాశివరాత్రి ఉండటంతో ఆరోజు కానీ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.