Ayodya Ram Mandir: అయోధ్య ట్రస్ట్ వద్ద ఇప్పుడు ఎంత నిధి ఉందో తెలుసా ?

అయోధ్య రామమందిరం నిర్మాణానికి, భక్తుల సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకు రూ.900 కోట్లు ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్ కోశాధికారి తెలిపారు. ఇంకా తమవద్ద రూ.3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 22 అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది.

Ayodya Ram Mandir: అయోధ్య ట్రస్ట్ వద్ద ఇప్పుడు ఎంత నిధి ఉందో తెలుసా ?
New Update

Ayodya Ram Mandir: అయోధ్య రామమందిరం ఆవిష్కరణను సమయం దగ్గరపడుతోంది. దీంతో ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఆలయానికి సంబంధించిన అయోధ్య ట్రస్ట్ కోశాధికారి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా గుడి నిర్మాణానికి, భక్తులు సౌకర్యాలు కల్పించేందుకు దాదాపు రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ ఆలయానికి తమవంతు విరాళాలు ఇవ్వడంతో ఇంకా తమ వద్ద రూ.3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు భక్తుల సౌకర్యం కోసం.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలో వేరు వేరు చోట్ల 10 పడకల ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తోందని రామమందిర ట్రస్ట్‌ సభ్యుడు అనిల్ మిశ్రా (Anil Mishra) చెప్పారు.

Also Read: లేదు నేనెక్కడికీ వెళ్ళడం లేదు..ఆ వార్తలన్నీ అవాస్తవం-స్మితా సభర్వాల్

ప్రాణప్రతిష్ఠ సమయంలో దాదాపు 12 నుంచి 15 వేల మంది భక్తులు అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోందని.. వివిధ బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఇదిలా ఉండగా.. జనవరి 22న అయోధ్య రామమందిరం ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివస్తారని ట్రస్ట్ సభ్యులు భావిస్తున్నారు. ఇటీవల ట్రస్ట్ సభ్యులు ప్రధాని మోదీని (PM Modi) రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Also Read: ఆధార్ సేవలకు అధికంగా వసూలు చేస్తే భారీ జరిమానా..!

#telugu-news #national-news #ayodhya-ram-mandir #ayodhya-ram-temple
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe