Ayodhya: ప్రాణ ప్రతిష్టకు ముందే దర్శనమిచ్చిన బాలరాముడి దివ్యరూపం

ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యమంగళ రూపం దర్శనమిచ్చింది. కన్నుల పండుగగా ఉన్న రాముని సుందర రూపాన్ని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ విడుదల చేసింది. కృష్ణశిలతో తయారు చేసిన ఈ విగ్రహం జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు.

New Update
Ayodhya: ప్రాణ ప్రతిష్టకు ముందే దర్శనమిచ్చిన బాలరాముడి దివ్యరూపం

Ayodhya Ram Lalla Idol Revealed: అయోధ్య రాముడు నాలుగు రోజులు ముందుగానే కనిపించాడు. భక్తులను రంజింపజేస్తూ తన దివ్య రూపాన్ని దర్శనమిచ్చాడు. నిన్న గర్భుగుడిలో పెట్టిన బాలరాముని విగ్రహ రూపాన్ని ఇవాళ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ (Shri Ram Janmbhoomi Trust) విడుదల చేసింది. జనవరి 22న ఆలయ గర్భుగుడిలో ఈ విగ్రహానికే ప్రధాని మోడీ (PM Modi) ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న తెల్లవారుఝామున బాలరాముని విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకువచ్చారు.

publive-image

మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) అయోధ్య బాలరాముని విగ్రహాన్ని తయారు చేశారు. కృష్ణశిలతో దీనిని రూపొందించారు. విగ్రహం పొడవు 51 అంగుళాలు...బరువు 150 కేజీలు. అభిజిత్ ముహూర్తంలో పుష్య, శుక్ర, ద్వాదశి 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభోగం నిర్వహించనున్నారు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు. ఇక కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి (Ganeshwar Shastri) ఆధ్దర్యంలో ఈరోజు, రేపు బాలరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇప్పుడు బాలరాముని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దాంతో పాటూ గర్భగుడిలో బాలరాముని మీద సూర్యుని ఆకారంలో కిరణాలు పడేట్టు ప్రాకారాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం.

Also Read: అయోధ్యలో డేగ కళ్లతో నిఘా.. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బంది

ఇక అయోధ్య రామాలయం కూడా ప్రత్యేకంగా నిర్మించారు. అంతేకాదు దీన్ని సాంప్రదాయ నాగర్‌ శైలిలో కట్టారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఈ మందిరాన్ని నిర్మించారు. గుడి మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది.ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి. దేవాలయం మొత్తంలో ఐదు మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపాలు ఉంటాయి. ఇక ఆలయంలోని మొత్తం గోడలు, స్తంభాల మీద అందరు దేవతమూర్తుల రూపాలను చెక్కారు. దాంతో పాటూ రామాయణ ఘట్టాలను చిత్రించారు.రామాలయంలోకి తూర్పు దిశ నుంచి ప్రవేశం ఉంటుంది. ప్రవేశ ద్వారాన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తలుపుల మీద నెమలి ఆకారాన్ని చెక్కారు. దీంతో తలుపులు తెరుచుకున్నప్పుడు నెమలి పురి విప్పినట్టు, మూసినప్పుడు మామూలుగా నెమలి కనిపించేట్టు రూపొందిచారు. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతాకూపం) ఉంది.మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్‌, సిమెంట్‌, కాంక్రీటును వాడలేదు. యూపీ, గుజరాత్‌, రాజస్థాన్‌ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు.

జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది. దీనికి దాదాపు ఎనిమిది వేల మంది విశిష్ట అతిథులు రానున్నారు. మొదటి రోజు ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే దర్శనం. రెండవ రోజు నుంచి సామాన్య ప్రజలకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. సరయూ నదీ తీరంలో నిర్మించిన అమోధ్య రామమందిరం ఇండియాలోనే మూడో అతి పెద్ద హిందూ దేవాలయం.

Advertisment
తాజా కథనాలు