/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/birdflu-jpg.webp)
Bird Flu : వియత్నాం(Vietnam) లో ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లు)తో ఓ మనిషి చనిపోవడం అటు డాక్టర్లను, ఇటు సామాన్యులను షాక్‌కు గురి చేసింది. 21 ఏళ్ల విద్యార్థి ఏవియన్ ఫ్లూతో చనిపోయాడు. ఇలా బర్డ్ ఫ్లూతో ఓ మనిషి చనిపోవడం(Man Dies) ఇదే తొలిసారి. వియత్నం అధికారుల ప్రకారం ఎపిడెమియోలాజిక్ దర్యాప్తులో మృతుడి ఇంటి సమీపంలో అనారోగ్యం(Illness) లేదా చనిపోయిన కోళ్లు కనుగొనబడలేదు. కానీ లూనార్ న్యూ ఇయర్(Lunar New Year) సెలవులకు ముందు, తరువాత అడవి పక్షులు అతని ఇంటి సమీపంలో చిక్కుకున్నట్లు కనుగొన్నారు. వాతావరణం ఊహించని మార్పులను చూపిస్తుందని, ఇది వైరస్ అభివృద్ధికి అనుకూలమైన కారకాలు అని వియత్నం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసులను గుర్తించడానికి నిఘా పెంచాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరింది.
Vietnam confirms a 21-year-old student who died over the weekend was infected with H5N1 bird flu
— BNO News (@BNOFeed) March 25, 2024
మనుషులకు ముప్పు తప్పదా?
21 ఏళ్ల కాలేజీ విద్యార్థికి హెచ్-5 ఇన్ఫెక్షన్ సోకినట్లు గత వారం మీడియా నివేదించింది. ఈ విషయాన్నిప్రావిన్షియల్ హెల్త్ కూడా అధికారులు ధృవీకరించారు. అయితే ఇప్పటివరకు ఏ హెచ్5ఎన్1 క్లేడ్ ఆ వ్యక్తికి సోకిందో తెలియరాలేదు. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ చలామణిలో ఉన్న పాత క్లేడ్ (2.3.2.1 సి) ఇటీవల కంబోడియాలో అనేక అనారోగ్యాలకు కారణంగా తెలుస్తోంది. ఇవి చాలా ప్రాణాంతకం. పౌల్ట్రీని ప్రభావితం చేసే కొత్త క్లేడ్ (2.3.4.4 బి) అరుదైన సందర్భాల్లో ప్రజలకు కూడా సోకుతుందని సమాచారం.
While it's unknown how he was infected, he reported catching wild birds around Lunar New Year. No reports of sick or dead poultry near his home.
— BNO News (@BNOFeed) March 25, 2024
బర్డ్ ఫ్లూ అంటే?
బర్డ్ ఫ్లూ(Bird Flu) అనేది ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా(Influenza) అని కూడా పిలువబడే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఒక పక్షి నుంచి మరో పక్షికి వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ ప్రాణాంతక రకం హెచ్ 5 ఎన్ 1. హెచ్5ఎన్1 వైరస్ సోకిన పక్షులు చనిపోతాయి. ఈ వైరస్ సోకిన పక్షుల నుంచి ఇతర జంతువులకు కూడా వ్యాపిస్తుంది. 1997లో హాంకాంగ్‌లో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదైంది. ఆ సమయంలో కోళ్ల ఫారాల్లో వ్యాధి సోకిన కోళ్లే ఈ వ్యాప్తికి కారణమని తేలింది. 1997లో బర్డ్ ఫ్లూ సోకిన వారిలో 60 శాతం కోళ్లు చనిపోయాయి. సోకిన పక్షి మలం, ముక్కు స్రావాలు, నోటి లాలాజలం లేదా కళ్ల నుంచి వచ్చే నీరు తాకడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. బర్డ్ ఫ్లూ సహజంగా వలస జల పక్షుల నుంచి ముఖ్యంగా అడవి బాతుల నుంచి వ్యాపిస్తుంది. ఈ అడవి పక్షుల నుంచి ఈ వైరస్ దేశీయ కోళ్లకు వ్యాపిస్తుంది. అడవి పక్షుల నుంచి పందులు, గాడిదలకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. 2011 నాటికి ఈ వ్యాధి బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, భారత్, ఇండోనేషియా, వియత్నాం దేశాలకు వ్యాపించింది. బర్డ్ ఫ్లూ సోకిన పక్షిని తాకినప్పుడు మాత్రమే మనుషుల్లో ఇది వ్యాపిస్తుంది. ఇక కొన్ని నివేదికల ప్రకారం ఈ ఫ్లూ చైనాలోని పక్షుల మార్కెట్ నుంచి వ్యాపించిన వ్యాధి!
Also Read : స్టేడియంలో కొట్టుకున్నది పాండ్యా-రోహిత్ ఫ్యాన్స్ కాదా?