TS RTC : ఆర్టీసీ సిబ్బందిపై ఆటో డ్రైవర్లు దాడి.. నీళ్లు చల్లి బూతులు తిడుతూ

ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటోడ్రైవర్లు దాడిచేసిన ఘటన కొత్తగూడెంలో జరిగింది. ఆటోల్లో వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులు బస్ రావడంతో ఆటోనుంచి దిగేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన నలుగురు ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్‌ కె.నాగరాజుపై దాడిచేశారు. బూతులు తిడుతూ కొట్టినట్లు నాగరాజు కంప్లైట్ చేశాడు.

TS RTC : ఆర్టీసీ సిబ్బందిపై ఆటో డ్రైవర్లు దాడి.. నీళ్లు చల్లి బూతులు తిడుతూ
New Update

TS RTC : తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ 'మహాలక్ష్మీ పథకం'లో భాగంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు (Bus) ప్రయాణంపై ఆటో (Auto) డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కారణంగా తమకు ఉపాధి లేకుండా పోయిందని, కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ఈ స్కీమ్ మొదలైన మొదిటిరోజు నుంచే ఆటోవాలలు పలు చోట్లు ధర్నాలకు దిగారు. ప్రభుత్వం తమకు ప్రత్యాన్మయం చూపించాలని కోరుతున్నారు. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన రేవంత్ సర్కార్ తప్పకుండా ఆటోవాలలకు న్యాయం చేస్తామని, దీనిపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అంతేకాదు ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తు ఫారమ్ బుధవారం సచివాలయంలో విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ ఆటోవాలల ఇష్యూను పరిగణలోకీ తీసుకుంటామని మాటిచ్చారు. కానీ ఆటో డ్రైవర్లు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణ రహింతగా దాడికి దిగడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి : Amrit Bharat Express : ప్రయాణికులకు షాక్.. ‘అమృత్‌ భారత్‌’ జర్నీ చాలా కాస్ట్‌లీ!

ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటోడ్రైవర్లు (Auto Drivers) దాడిచేసిన సంఘటన కొత్తగూడెం డిపో పరిధిలో జరిగింది. కొత్తగూడెం నుంచి మధ్యాహ్నం ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్‌ కూడలికి చేరుకుంది. అయితే అప్పటిదాకా బస్ కోసం వెయిట్ చేసిన చాలామంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు ఆలస్యం కావడంతో అక్కడే ఉన్న సర్వీసు ఆటోల్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే అక్కడకు బస్ రావడంతో ఆటోనుంచి దిగిన ప్రయాణికులు బస్సు ఎక్కేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్‌ కె.నాగరాజుపై దాడిచేశారు. వాటర్ బాటిల్లతో నాగరాజుపై నీళ్లు చల్లుతూ బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. కండక్టర్‌ సరస్వతి, ప్రయాణికులు, వాహనదారులు వారించే ప్రయత్నం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో డ్రైవర్ నాగరాజు కొత్తగూడెం డిపో మేనేజర్‌ బాణాల వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ వివాదంపై విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

#telangana #attack #auto-drivers #rtc-driver
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe