Atchutapuram Blast : అచ్యుతాపురంలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనపై థర్డ్ పార్టీ కీలక విషయాలను బయటపెట్టింది. యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు నివేదికలో తెలిపింది. సంస్థలో ఉన్న లోపాలను గత ఏడాది ఇచ్చిన నివేదికలోనే చెప్పినట్లు థర్డ్ పార్టీ నివేదిక పేర్కొంది.