Pinnelli Ramakrishna Reddy: హైకోర్టులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. నిన్న హైకోర్టులో రెండు వర్గాల వాదన ముగిసింది. ఇవాళ పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. జూన్ 26 నుంచి నెల్లూరు జిల్లా జైలులో ఉన్నారు పిన్నెల్లి. జిల్లా కోర్టులో రెండు సార్లు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. షరతులకు కట్టుబడి ఉంటానని.. బెయిల్ ఇవ్వాలని కోరారు పిన్నెల్లి. ఎన్నికల టైమ్లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Pinnelli Ramakrishna Reddy : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్?
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి కేసులో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా?లేదా? అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.
Translate this News: