AP Deputy CM Pawan Kalyan: రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యాసంస్థల వివరాలను తెలియజేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఆస్ట్రేలియా హైకమీషనర్ ఫిలిప్‌గ్రీన్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో చెన్నైలో ని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనమిక్ కౌన్సిలర్ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు. ఫిలిప్ గ్రీన్‌కు పవన్ కల్యాణ్ కూరగాయల బొకే ఇచ్చారు.
Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన ఆస్ట్రేలియా హై కమిషనర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్‌గ్రీన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రా నుంచి ఆస్ట్రేలియాకు పై చదువులకు వెళ్ళే విద్యార్ధులకు మార్గ నిరదేశం చేయాలని ఫిలిప్‌ను పవన్ కల్యాణ్ కోరారు.
New Update
Advertisment