ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలి అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నిరోజులు గడిచినా కూడా ఆ కార్మికులను ఇంకా బయటకు తీసుకురాలేకపోయారు. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఒకదానివెనుక మరొకటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే రెండు, మూడు రోజుల్లో ఆ కార్మికులను బయటకు తీసుకొస్తారని అందరు అనుకున్నారు. కానీ వారిని బయటకు తీసుకొచ్చేందుకు మరికొన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. సొరంగం తవ్వడానికి తీసుకొచ్చిన ఆగర్ మిషన్ ఆగిపోవడంతో శుక్రవారం సాయంత్రం సహాయక పనులు నిలిచిపోయాయి.
Also Read: నేను ఆ రోజే చనిపోతానని ఫిక్స్ అయ్యాను.. కానీ లక్కీగా బతికిపోయా
సమాంతరంగా తవ్వకాలు చేస్తున్న అమెరికాకు చెందిన ఆగర్ మిషన్‌కు సొరంగంలోని ఓ ఇనుప పట్టి అడ్డుపడి బ్లేడ్ దెబ్బతినడంతో పని ఆగిపోయింది. దీంతో ఇరుక్కున్న బ్లేడ్‌ను కట్ చేసేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను రప్పిస్తున్నారు. లక్ష్యానికి ఇంకా 10 నుంచి 12 మీటర్ల దూరంలో డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి. అయితే అధికారులు రెండు ప్రత్యా్మ్నాయాలపై దృష్టి సారించారు. అందులో ఒకటి.. 10 నుంచి 12 మీటర్ల దూరాన్ని మాన్యువల్‌గా డ్రిల్లింగ్ చేయడం.. ఇక రెండోది కొండపై నుంచి నిలువుగా 86 మీటర్లు డ్రిల్లింగ్ చేయడం. అయితే ఇది పూర్తవ్వడ్డానికి కొన్ని పట్టే అవకాశం ఉందని ఎన్‌డీఎంఏ మెంబర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ సయ్యద్ హస్నాబాద్ పేర్కొన్నారు.
Also read: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి డీఏ పెంపు..