US about Israel-Hamas War: హమాస్ ను సమూలంగా పెకిలివేయడమే లక్ష్యంగా విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. నెమ్మదిగా గాజా చుట్టూ ఉచ్చును బలంగా బిగిస్తోంది. ఇందులో భాగంగా గాజాలోని కీలక ప్రాంతంలో ఐడీఎఫ్ దళాలు అడుగుపెట్టాయి.హమాస్‌ను (Hamas) పూర్తిగా అంతమొందించేదాకా ఈ యుద్ధం ఆగేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పారు. వార్ ముగిశాక గాజా (Gaza) మొత్తం బాధ్యతలను తామే తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ మిత్ర దేశం అమెరికా (US) దీన్ని వ్యతిరేకిస్తోంది. గాజాను స్వాధీనం చేసుకోవడం ఇజ్రాయెల్ కు అంత మంచిది కాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ లో కథనం వెలువడింది.
Also Read:ఏం ఆడాడురా బాబూ…రికార్డులన్నీ క్యూలు కట్టాయి.
యుద్ధం తర్వాత గాజాలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. ఏ ప్రభుత్వం వస్తుందో అంతకంటే తెలియదు. యుద్ధం ముందు ఎలా ఉందో అలా పరిస్థితులు మామూలు అవ్వడానికి సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో గాజాను తమ ఆధీనంలోకి తెచ్చుకోవలనుకోవడం సరి అయినది కాదని వైట్ హౌస్ జాతీయ భద్రతామండలి అధికారి జాన్ కిర్బీ అన్నట్లు కథనంలో వచ్చింది.
మరోవైపు గాజాలో మనవతా సహాయానికి యుద్ధంలో విరామాలు ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ మమాస్ ను అంతమొందించే వరకు యుదధం మాత్రం ఆపమని స్పష్టం చేశారు. ఈ వార్ తామే గెలుస్తామని నమ్మకంగా చెప్పారు. 2007 ముందు వరకు గాజా ఇజ్రాయెల్ (Israel) ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత హమాస్ దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. అక్కడ మొత్తం జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు. మరోవైపు హమాస్ మరో 5గురు బందీలను విడుదల చేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద దాడి చేసిన హమాస్ మొత్తం 240 మందిని బందీలుగా గాజాకు తరలించింది.
Also Read:జీవిత పాఠాలు నేర్పిన మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్.. ఎలానో తెలుసుకోండి!