Bihar: పేపర్‌ లీక్స్ అరికట్టేందుకు బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పేపర్‌ లీక్‌లను అరికట్టేందుకు బిహార్‌ అసెంబ్లీ సమావేశాల్లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం.. బిహార్‌ పబ్లిక్ ఎగ్జామినేషన్‌ బిల్లు-2024ను పాస్‌ చేసింది. దీని ప్రకారం ఎవరైనా పేపర్‌ లీక్‌కు పాల్పడితే వాళ్లకు రూ.కోటి జరిమానాతో పాటు మూడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు.

Bihar: పేపర్‌ లీక్స్ అరికట్టేందుకు బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..
New Update

నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ నీట్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నీట్‌తో పలు పోటీ పరీక్షల పేపర్‌ లీక్‌ ఘటనలు ఇటీవల కలకలం రేపాయి.ఈ నేపథ్యంలో బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం వీటిని అరికట్టేందుకు ముందడుగు వేసింది. బుధవారం అసెంబ్లీ సమవేశాల్లో బిహార్‌ పబ్లిక్ ఎగ్జామినేషన్‌ బిల్లు-2024ను పాస్‌ చేసింది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా పేపర్‌ లీక్‌కు పాల్పడితే వాళ్లపై రూ.కోటి రూపాయల జరిమానాతో పాటు మూడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు.

Also Read: మరో రెండ్రోజుల్లో పారిస్‌ ఒలింపిక్స్‌.. బరిలోకి భారత్‌ నుంచి 14 ఏళ్ల బాలిక

ఈ బిల్లును మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టగా బుధవారం శాసన మండలిలో దీనికి ఆమోదం తెలిపారు. ఇదిలాఉండగా.. పబ్లిక్‌ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం.. పబ్లిక్ ఎగ్జామినేషన్‌ యాక్ట్‌,2024 ను ఆమోదించింది. ఆ తర్వాత అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ఇలాంటి బిల్లులనే తమ అసెంబ్లీలో ఆమోదించాయి. ఇక బిహార్‌లో అక్కడి పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ మెయిన్స్ పరీక్ష కూడా పేపర్ లీక్‌ ఆరోపణలతో వాయిదా పడింది. అలాగే కానిస్టేబుల్‌ పరీక్షలో కూడా పేపర్‌ లీక్ జరగడంతో ఈ పరీక్షను సైతం రద్దు చేశారు. ఇలాంటి తరుణంలోనే పేపర్‌ లీక్‌లను అడ్డుకునేందుకు బిహార్ ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.

Also Read: పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిల పక్ష భారత ఎంపీలు!

#telugu-news #bihar #neet #nithish-kumar #paper-leaks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe