Ashok Chavan : కాంగ్రెస్‌ కు కటీఫ్‌.. బీజేపీతో దోస్తీకి సై అంటున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ కమలం గూట్లో చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, చంద్రకాంత్‌ బవాన్‌ కులే సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.

New Update
Ashok Chavan : కాంగ్రెస్‌ కు కటీఫ్‌.. బీజేపీతో దోస్తీకి సై అంటున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

Maharashtra : కాంగ్రెస్‌(Congress) నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర(Maharashtra)  మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌(Ashok Chavan) కమలం గూట్లో చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, చంద్రకాంత్‌ బవాన్‌ కులే సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.

ముందు నుంచి కూడా చవాన్‌ కాంగ్రెస్‌ కు బై చెప్పనున్నట్లు వార్తలు వస్తునే ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఆయన సోమవారం కాంగ్రెస్‌ కు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలేకు లేఖ పంపారు. కాంగ్రెస్‌ కు రాజీనామా చేసిన తరువాత చవాన్‌ మాట్లాడారు. ఇంకా '' బీజేపీ(BJP) లో చేరాలని తాను నిర్ణయించుకోలేదని '' ప్రకటించారు.

అయితే మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌, అమర్‌ రాజుర్కర్‌(Amarnath Rajurkar) మంగళవారం నాడు బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరి కొంత మంది నేతలు కూడా బీజేపీ గూటికి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. చవాన్‌ బీజేపీలో చేరితే రాజ్యసభ అభ్యర్థిత్వం లభించే అవకాశం ఉందని సమాచారం. చవాన్‌ బీజేపీ నుంచి రాజ్యసభకు రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఈరోజు సాయంత్రంలోగా మహారాష్ట్ర రాజ్యసభకు బీజేపీ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన పెండింగ్‌లో ఉంది.ఈ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ దేశ్‌ముఖ్‌ , ధీరజ్ దేశ్‌ముఖ్, జితేష్ అంతర్‌పుర్కర్, కునాల్ పాటిల్, సంగ్రామ్‌, మాధవరావు, విశ్వజిత్ కదమ్.

కొంతకాలం క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాబా సిద్ధిఖీ, మిలింద్ దేవరా కూడా మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి SB చవాన్ కుమారుడు చవాన్ నిష్క్రమణ తరువాత కాంగ్రెస్ నుండి నిష్క్రమించారు. ఇది రాష్ట్రంలో పార్టీకి సవాళ్లను జోడించింది. కాంగ్రెస్‌ నుంచి వైదొలగడం తన వ్యక్తిగత నిర్ణయమని, బీజేపీలో చేరాలని తాను ఇంకా నిర్ణయించుకోలేదని చవాన్‌ స్పష్టం చేశారు.

Also Read :  ఒక్క రోజులో అదృశ్యమైన గ్రామం.. దెయ్యాలే కారణమా?

Advertisment
తాజా కథనాలు