Asaduddin Owaisi: శాంతి భద్రత విషయంలో తెలంగాణ భేష్ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు. By Karthik 19 Sep 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ముస్లింలు ఎలాంటి ఇబ్బంది పడటం లేదని ఎంపీ వెల్లడించారు. గతంలో కర్నాటకలో బీజేపీ హయాంలో ముస్లింలు దారుణ పరిస్థితి ఎదుర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు. అక్కడ హిజాబ్ వివాదం వల్ల ముస్లిం విద్యార్థినులు కళాశాలకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడేవారని, బీజేపీ విద్యార్థి సంఘాలు ముస్లిం విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని దాడి చేశారని ఎంపీ గుర్తు చేశారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇక్కడ మైనార్టీ విద్యార్థులు కళాశాలలకు స్వేచ్చగా వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతకు లోటు లేదన్నారు. తెలంగాణలో హిజాబ్ వివాదం లేదని ఆయన తెలిపారు. హిజాబ్ వివాదం సృష్టించాలని ప్రయత్నించే వారిని సీఎం కేసీఆర్ అరికడుతున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు సీఎం కేసీఆర్ మైనార్టీ బంధు ఇవ్వడంపై ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. దీని వల్ల పేద మైనార్టీలు లబ్దిపొందే అవకాశం ఉందన్నారు. మరోవైపు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఒవైసీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలు పోరాడుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల అనంతరం థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ కూటమికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ఒవైసీ సూచించారు. కాగా సీఎం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. దీంతో ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారింది. #brs #telangana #cm-kcr #mim #asaduddin-owaisi #muslims #law-and-order #hijab-controversy #minority-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి