Aravind Kejriwal: ఐదోసారీ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా

లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈడీ పంపిన నోటీసులకు కేజ్రీవాల్ సమాధానం ఇస్తూ తాను విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.

New Update
Aravind Kejriwal: ఐదోసారీ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా

Delhi Liquor Scam Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మళ్ళీ ఈడీ (ED) విరణకు హాజరుకావడం లేదు. ఇలా విచారణకు హాజరుకాకపోవడం కేజ్రీవాల్‌కు ఐదవసారి. ఇంతకు ముందు కూడా నాలుగుసార్లు పలు కారనాలు చెబుతూ ఈడీ విచారణకు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఈడీ నోటీసులకు రిస్లై ఇచ్చిన కేజ్రీవాల్ తాను విచారణకు హాజరకుఆవడం లేదని స్పష్టం చేశారు. అయితే ఎందుకు రావడం లేదనేది మాత్రం అందులో చెప్పలేదు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

Also Read:Cricket: విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ రెండో టెస్ట్..బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.

ఢిల్లీ ఆప్ నేతల నిరసన..

మరోవైపు ఢిల్లీలో ఆప్ నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఛంఢీఘడ్ మేయర్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందటూ వారు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపథ్యంలో నగరంలో భారీగా పోలీసులు , పారా బలగాలు (Para Forces) మోహరించాయి. చండీగఢ్‌ మేయర్‌ (Chandigarh Mayor Election) ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కార్యకర్తలు, మద్దతుదారులు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్దమయ్యారు. తమ పార్టీకి మేయర్‌ ఎన్నికల్లో అన్యాయం జరిగిందని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఈ కారణంగానే కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాలేకపోతున్నారా లేక కావాలనే వెళ్ళడం లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

భారీ భద్రత మధ్య ఢిల్లీ..

దీంతో ఢిల్లీ పోలీసులు శుక్రవారం నాడు ఢిల్లీ భద్రతను కట్టుదిట్టం చేశారు. తాము నిరసన కార్యక్రమానికి అనుమతిని ఇవ్వము అని పోలీసులు చెప్పినప్పటికీ కూడా నిరసన కారులు, మద్దతుదారులు ఢిల్లీ నగరానికి భారీగా చేరుకుంటుండడంతో వారిని నిలువరించేందుకు సుమారు వెయ్యి మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బంది ఢిల్లీ నగరానికి చేరుకున్నారు.

Also Read: తగువు పెట్టుకున్నా బడ్జెట్ ఇచ్చారు..మాల్దీవులకు 600కోట్లు

Advertisment
తాజా కథనాలు