Tihar Jail: బెయిల్ కోసమే కేజ్రీవాల్ ఆ పదార్థాలు తింటున్నారు.. ఈడీ

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెరిగేందుకు కావాలనే తీపి పదార్థాలు తింటున్నారని ఈడీ తెలిపింది. అనారోగ్యం పేరుతో బెయిల్ పొందేందుకు స్వీట్స్, మామిడిపండ్లు తింటున్నారని పేర్కొంది. ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది వివేక్‌ జైన్‌ ఖండించారు.

New Update
Tihar Jail: బెయిల్ కోసమే కేజ్రీవాల్ ఆ పదార్థాలు తింటున్నారు.. ఈడీ

Arvind Kejriwal Eating Sweets - ED: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసుతం తీహార్ జైలులో (Tihar Jail) ఉన్నారు. అయితే కేజ్రీవాల్ అనారోగ్యానికి సంబంధించి పలు విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు షుగర్ లెవల్స్ (Sugar Levels) పడిపోగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ అప్ అండ్ డౌన్ కావాడానికి బలమైన కారణాలున్నాయని ఈడీ తెలిపింది.

మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు..
ఈ మేరకు కేజ్రీవాల్ (Arvind Kejriwal) షుగర్ లెవల్స్‌ పడిపోతుండటంతో తన రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదించేందుకు వారానికి 3సార్లు వీడియో కాన్ఫరెన్స్ అనుమతి కావాలని కోరుతూ కేజ్రీవాల్ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీనిపై స్పందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ .. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని చెప్పింది. అంతేకాదు చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని గురువారం ఢిల్లీ న్యాయస్థానికి వివరించింది. ఉద్దేశ్యపూర్వకంగానే స్వీట్స్ తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారని, షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలతో బెయిల్ పొందాలనుకుంన్నారని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: KCR: నాకు కొంచెం టైం ఇవ్వండి.. ఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్

ఇవన్నీ ఆరోపణలు మాత్రమే..
ఇక ఈడీ వ్యాఖ్యలను ఆప్ నెతలు ఖండించారు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే అని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది వివేక్‌ జైన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగానే కేజ్రీవాల్ ఆరోగ్యం దెబ్బతిన్నట్లు ఆయన కోర్టులో వివరించారు. ఇక మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్ట్‌ చేయగా.. మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్‌ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు