Breaking : తన ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నించిదంటూ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపనలు చేస్తున్నారు. బీజేపీ తన ఎమ్మెల్యేలు 21మందిని కొనడానికి చూస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. దీని కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తామని చెప్పారని కేజ్రీవాల్ అంటున్నారు.

New Update
CM Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. సీబీఐకి నోటీసులు

Kejriwal : ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal) సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ని కూల్చేందుకు బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌కు బీజేపీ తెరతీస్తోందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నన్ను అరెస్ట్ చేయిస్తామని మా ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరిస్తోంది. అప్పుడు ఆప్ ప్రభుత్వం కూలిపోతుందని... దాని తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. తమ ఎమ్మెల్యేలు 7గురిని బీజేపీ కొనడానికి చూసిందని కేజ్రీవాల్ అంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టిందని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఇప్పటికే 21 మంది ఆప్ నేతలు తమ దగ్గర ఉన్నారని బీజేపీ చెబుతోందని కేజ్రీవాల్ అంటున్నారు.

ఒకవైపు నితీశ్ కుమార్(Nitish Kumar) ఎన్డీయే(NDA) లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలతో భారతదేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్‌గా జరుగుతున్న మార్పులు హీట్‌ను పుట్టిస్తున్నాయి.

Also Read : Nitish Kumar : కూటమిలో కల్లోలం.. నితీశ్ యూటర్న్.. లెక్కలివే

Advertisment
తాజా కథనాలు