Chandrababu Case:ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది. By Manogna alamuru 06 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Chandrababu Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ (AP CID) దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ మీద ఏసీబీ కోర్టులో (ACB Court) వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరుఫున ప్రమోద్ కుమార్ దూబే (Pramod Kumar Dubey), సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వారి వాదనలు ముగిసిన తర్వాత న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వు చేస్తఉన్నట్టు ప్రకటించింది. మూడు రోజులుగా వీటి మీద వాదనలు జరగుతున్నాయి. మూడవ రోజు వాదనలు వినిపించిన సైడీ తరుపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలుగుదేశం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చార్టెడ్ అకౌంటెంట్ వెంకటేశ్వర్లు ఆడిటర్ గా వ్యవహరించారని తెలిపారు. అలాగే 14రోజుల జుడిషియల్ రిమాండ్ ముగిసిన తర్వాత పోలీసు కష్టడికి తీసుకోకూడదని లేదని అన్నారు. దర్యాప్తు సంస్థ విచారణలో వచ్చిన సమాచారాన్ని బట్టి విచారణ కోరవచ్చని కోర్టుకు తెలిపారు. విచారణను అధికార్లు ప్రశ్నలు రాసుకునే చేస్తారని అన్నారు. ఇక ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ నుంచి బ్యాంక్ స్టేట్మెంట్ ను ఎవరూ డౌన్ లోడ్ చేయలేరని సుధాకర్ రెడ్డి కోర్టుకు స్పష్టంచేశారు.చంద్రబాబు ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు...పోలీసు కస్టడీలో కొద్ది గంటల మాత్రమే ఉంటారు. అలా కాకుండా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే ఎక్కువ సేపు విచారించడానికి అవుతుందని సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు. ఇక చంద్రబాబునే సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న ఏఏజి వాదనలపై ఆయన తరుఫు న్యావాది దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీకి కోరడం పసలేని వాదన అని కొట్టి పడేశారు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారని, అప్పుడు విచారణలో చంద్రబాబు సహకరించారని దూబే కోర్టుకు తెలిపారు. కస్టడీ ముగిసినా ఇప్పటివరకు కేసు డైరీ సమర్పించలేదని ప్రమోద్ దూబే ఆరోపించారు. దీంతో కేసు డైరీ ఎక్కడ ఉందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సిఐడి అధికారులను ప్రశ్నించారు. Also Read:ఎన్నికల ముహుర్తం ఫిక్స్…ఎలక్షన్ డేట్ ఎప్పుడంటే? #acb #chandrababu-arrest #court #petition #cid #custody #chandarababu #chandrababu-skill-development-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి