Israel-hamas war:గాజాలో టన్నెల్స్ లోకి కృత్రిమ వరద..ఇజ్రాయెల్ ప్లాన్.

హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులు మళ్ళీ మొదలుపెట్టింది. గాజాలో హమాస్ కోసం అణువణువూ వెతుకుతోంది ఇజ్రాయెల్ సైన్యం. దీనిలో భాగంగా టన్నెల్స్ లో దాక్కున్న హమాస్ ను బయటకు తీసుకురావడానికి కృత్రిమ వరదను సృష్టించనున్నారు.

Israel-hamas war:గాజాలో టన్నెల్స్ లోకి కృత్రిమ వరద..ఇజ్రాయెల్ ప్లాన్.
New Update

హమాస్ ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇంత వరకూ బాంబుల మోత మోగించిన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు కొత్త పద్ధతిలో హమాస్ ను బయటకు రప్పించాలని ప్లాన్స్ వేస్తోంది. హమాస్ దళాలు గాజాలోని సొరంగాల్లో దాక్కున్నారు. వారు ఎక్కడ, ఏ సొరంగంలో ఉన్నారో కనుక్కోవడం చాలా కష్టం. టన్నెల్స్ లో కూడా చాలా నెట్ వర్క్ పెట్టుకుంది హమాస్. ఇజ్రాయెల్ సైన్యం వాళ్ళకోసం రెండు నెలలుగా వెతుకుతోంది. గాజాను అల్లకల్లోలం చేసింది. దీని వలన గాజాలో ప్రజలు చనిపోతున్నారు కానీ హమాస్ మిలిటెంట్లు మాత్రం దొరకడం లేదు. అందుకే ఇప్పుడు కొత్త ప్లాన్ వేసింది ఇజ్రాయెల్ సైన్యం.

Also Read:సీతక్కకు హోం, ఉత్తమ్ కు ఫైనాన్స్.. మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్ లు!

గాజాలో ఇజ్రాయెల్ కృత్రిమ వరదను సృష్టించనుంది. పంపుల ద్వారా సొరంగాల్లోకి నీటిని పంపించాలని ప్లాన్ వేస్తోంది. టన్నెల్స్ ను నీటితో మొత్తం నింపేస్తే ప్రాణ రక్షణ కోసం హమాస్ ఉగ్రవాదులు బయటకు వస్తారని ఇజ్రాయెల్ అంచనా వేస్తోందని వాల్ స్ట్రీట్ జనరల్ తెలిపింది. దీని కోసం ఇప్పటికే పలు ప్రాంతాలకు పంపులను పంపింది. అల్ఫతీ శరణార్ధి క్యాంపుకు ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ ఐదు భారీ పంపులను నవంబర్ ప్రారంభంలోనే ఏర్పాటు చేసింది. ఇవి గంటకు వేల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేయగలవు. వీటితో కొన్ని వారాల్లోనే గాజాలో ఉన్న సొరంగాలన్నీ నీటితో నింపేయవచ్చును. అయితే ఇది ఎప్పుడు చేస్తుంది అనేది మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు.

ఇక తమ దగ్గర ఉన్న బందీలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని హమాస్ చెప్పింది. ఇప్పటికి 50 మందిని విడుదల చేసిన హమాస్ మరికొంత మందిని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాల్పులను ఆపమని అడుగుతోంది.

#tunnels #israel #hamas #floods
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe