Army Cops : జమ్ముకశ్మీర్ (Jammu & Kashmir) లోని కుప్వారా జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌పై ఇండియన్ ఆర్మీ (Indian Army) సిబ్బంది చేశారు. ఈ ఘటనలో అయిదుగురు పోలీసులు గాయాలపాలయ్యారు. దీంతో ఈ దాడికి సంబంధమున్న 16 మంది ఆర్మీ సిబ్బందిపై కేసు నమోదైంది. వీళ్లలో ముగ్గురు లెఫ్టినెంట్ కల్నల్ (Lieutenant Colonel) స్థాయి అధికారులు కూడా ఉన్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆమోదం.. మార్చిన గీతం ఇదే!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా బాత్పొరా గ్రామంలో ఉంటున్న ఓ సైనికుడి ఇంట్లో మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సైనికాధికారులు తమ సిబ్బందితో కలిసి అదేరోజు రాత్రి 9.30 PM గంటలకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దాడులకు దిగారు. పోలీసు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై.. ఈ దాడికి సంబంధమున్న వారిపై కేసు నమోదైంది. ఇదిలాఉండగా.. మరోవైపు పోలీసులు, ఆర్మీ సిబ్బంది మధ్య ఎలాంటి భౌతిక దాడి జరగలేదని రక్షణశాఖ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. కానీ వారి మధ్య విభేదాలు తలెత్తాయని.. వాటిని పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు.
Also Read: పది పరీక్షల మీద పది సార్లు దండయాత్ర..పాసవ్వడంతో బ్యాండు మేళంతో ఊరేగింపు!