/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Are-you-sneezing-in-the-morning.these-tips-are-for-you-jpg.webp)
Health Benefits: చలికాలంలో (Winter Season) ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో రకాల వైరస్‌లు మనపై దాడి చేస్తూ ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడుతూ ఉంటాం. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడడంలో, అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి మనకు మేలు చేయడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది
మనం ఎక్కువగా వంటల్లో జీలకర్రను వాడుతూ ఉంటాం. జిలకర్ర నేరుగా వాడటం కంటే కషాయం చేసుకొని తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. జీలకర్ర కషాయం తాగడం వల్ల మన శరీరం దృఢంగా మారుతుంది. రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. బరువు కూడా తగ్గిపోతారని చెబుతున్నారు - Health Benefits ప్రతిరోజు జీలకర్ర కషాయం సేవించడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య ఎక్కువ అవుతుంది. బాలింతల్లో పాలు బాగా పడతాయి. అతిసారం, విరోచనాలు తగ్గిపోతాయి. రక్తంలో ఉండే వేడి కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఉదయం జీలకర్ర కషాయం తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, కడుపులో గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యల నుంచి కూడా జీలకర్ర ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: కలబంద గుజ్జుతో ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు మాయం
వాతావరణంలో కాలుష్యం వల్ల ఎక్కువగా జలుబు, దగ్గు వస్తూ ఉంటుంది. ఈ జీలకర్ర కషాయం తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. చాలామంది ఉదయం గొంతులో శ్లేష్మం పేరుకుపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. తరచూ తుమ్ములు వస్తూ ఉంటాయి. ముక్కు నుంచి నీళ్లు కూడా వస్తుంటాయి. అలాంటివారు జీలకర్ర కషాయం తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ జీలకర్ర కషాయాన్ని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. రెండు గ్లాసుల నీళ్లలో ఒక స్పూన్ జీలకర్ర వేసి నీరు సగం అయ్యేవరకు మరిగించాలి. ఆ తర్వాత దాన్ని వడకట్టుకొని తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. జీలకర్ర కషాయం తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాకుండా మన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రక్తం కూడా పరిశుభ్రమౌతుంది. గొంతు బొంగురు పోవడం, గొంతులో నొప్పి, ఇన్ఫెక్షన్ నయం చేయడంలో జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది.