Alcohol Side effects: మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!!

ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సాయంత్రం, రాత్రివేళల్లోనే కాదు.. రోజంతా బార్ షాపుల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. యువత కూడా మద్యానికి బాగా అలవాటుపడిపోయింది. వారికి తగ్గట్టే మార్కెట్లో రకరకాల మద్యం బ్రాండ్స్ వస్తున్నాయి. బ్యాచిలర్ పార్టీ, హౌస్ పార్టీ, బార్, పబ్, హోటల్ లో ఆల్కహాల్ తో పాటు.. ఆహారపదార్థాలు కూడా వడ్డిస్తారు. మద్యంతో పాటు కొన్నిరకాల ఆహారాలను ఆర్డర్ చేస్తారు. ఆల్కహాల్‌తో పాటు లేదా మద్యం..

Alcohol Side effects: మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!!
New Update

Alcohol Side effects: ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సాయంత్రం, రాత్రివేళల్లోనే కాదు.. రోజంతా బార్ షాపుల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. యువత కూడా మద్యానికి బాగా అలవాటుపడిపోయింది. వారికి తగ్గట్టే మార్కెట్లో రకరకాల మద్యం బ్రాండ్స్ వస్తున్నాయి. బ్యాచిలర్ పార్టీ, హౌస్ పార్టీ, బార్, పబ్, హోటల్ లో ఆల్కహాల్ తో పాటు.. ఆహారపదార్థాలు కూడా వడ్డిస్తారు. మద్యంతో పాటు కొన్నిరకాల ఆహారాలను ఆర్డర్ చేస్తారు. ఆల్కహాల్‌తో పాటు లేదా మద్యం సేవించిన తర్వాత కూడా తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయట. వాటిని తింటే అనారోగ్యానికి అడ్రస్ ఇచ్చి ఆహ్వానం పలికినట్టే.

పాలు తాగకూడదు: మద్యం సేవించిన తర్వాత పాలు తాగకూడదు. అలాగే మద్యం తాగేటపుడు వేరుశెనగ లేదా జీడిపప్పు తినడం ఆరోగ్యానికి హానికరం. ఇలా చేస్తే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయి ఊబకాయానికి దారితీస్తుంది.

శీతల పానీయాలు తాగకూడదు: సోడా లేదా శీతల పానీయాల్లో ఆల్కహాల్ ను కలుపుకుని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో గ్యాస్ అధికంగా ఉంటుంది. వాటికి బదులుగా కూల్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ లో మద్యం కలిపి తాగొచ్చు.

క్రిస్పీ చిప్స్ తినకూడదు: మద్యం సేవించే సమయంలో లేదా తర్వాత క్రిస్పీ చిప్స్, వేయించిన మోమోస్, చికెన్ ను తినకూడదు. తింటే కడుపులో లేనిపోని తేడాలొస్తాయి. తర్వాత డాక్టర్ దగ్గరకెళ్లి వేలకు వేలు వదిలించుకోవాలి.

స్వీట్లు-చాక్లెట్లు తినకూడదు: మద్యం సేవించిన తర్వాత స్వీట్లు, చాక్లెట్లు తినకూడదు. ఇవి తింటే మత్తు మరింత పెరుగుతుంది. మద్యం తాగిన తర్వాత స్వీట్లు తినడం అంటే.. విషాన్ని తినట్టేనట. కాబట్టి మద్యం తాగేటపుడు ఈ ఆహారాలను అస్సలు తినకండి.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి హౌస్ అరెస్ట్.. పోలీసులపై ఎమ్మెల్యే సీరియస్!!

#alcohol #foods #side-effects #drinking-alcohol #eating-these-foods #be-careful
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe