Drinking Water Night: రాత్రిపూట నీరు ఎక్కువగా తాగుతున్నారు..? అయితే..జాగ్రత్త తీసుకోండి

మన శరీరానికి తగినంత నీరు తాగటం చాలా అవసరం. రాత్రి సమయంలో ఎక్కువ నీరు తాగేవారు నిద్రకు ఆటంకం లేకుండా, మూత్రవిస‌ర్జన జరిగేలా చూసుకోవాలి. పొట్ట నిండా నీటిని తాగి ప‌డుకుంటే శ్వాస ఇబ్బందులు, గుండెల్లో మంట వంటి ఆనారోగ్య స‌మ‌స్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Drinking Water Night: రాత్రిపూట నీరు ఎక్కువగా తాగుతున్నారు..? అయితే..జాగ్రత్త తీసుకోండి

Drinking Water Night: మనిషి శ‌రీరానికి నీరు ఎంతో అవ‌స‌రం. మన శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌క్రమంగా ఉండాలన్న, శ‌రీరంలో మ‌లినాలు బ‌య‌ట‌కు పంపటానికి, శ‌రీరం, చ‌ర్మం ఆరోగ్యంగా ఉంచ‌డంలో నీరు చాలా అవసరం. ప్రతీ రోజూ 3 నుంచి 4 లీట‌ర్ల నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలామంది నీటిని తాగే విష‌యంలో రకరకాల అపోహ‌లు పెట్టుకుంటారు. కాగా.. రాత్రి ప‌డుకునే ముందు నీటిని తాగోచ్చా..? లేదా..? అనే డౌట్‌ చాలామందికి ఉంటుంది. ఈ విషయంలో ఎవ‌రినైనా సలహా అడిగితే.. రాత్రి నీటిని ఎక్కువ‌గా తాగ‌కూడదని చాలా వరకు చెబుతూ ఉంటారు. అయితే.. రాత్రి పూట నీటిని ఎక్కువ‌గా తాగాలా..? వ‌ద్దా..? ఈ డౌట్‌కి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు కొన్ని విషయాలను ఇప్పుడు చుద్దాం.
గొంతు ఆరిపోయి.. గుర‌క ఎక్కువ‌గా వ‌స్తుంది
మ‌నం రోజంతా ఎన్నో ప‌నులు చేసి ఉంటాము. దీనివలన మ‌న శ‌రీరం ఎక్కువ‌గా నీటిని కోల్పోయి.. శ‌రీరంలో నీటి శాతం త‌గ్గుతుంది. అందుకని.. శ‌రీరంలో త‌గినంత నీటి శాతం లేకుండా నిద్రపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు రాత్రి ప‌డుకునే స‌మ‌యంలో శ‌రీరంలో నీటి శాతం త‌గ్గడం వ‌ల్ల గొంతు ఆరిపోయి.. గుర‌క ఎక్కువ‌గా వ‌స్తుందని వైద్యులు చెబుతున్నారు. క‌నుక పడుకునే ముందు నీటి శాతం ఉండేలా చూసుకుంటే శరీరానికి మంచిది. దీని వలన శరీరం హైడ్రేటెడ్‌తోపాటు శ‌రీరంలో అల‌స‌ట త‌గ్గి.. మంచి నిద్ర పోతారు. మ‌రుస‌టి రోజూ ఉత్సాహంగా ప‌ని చేసుకుంటారు. కానీ.. షుగ‌ర్, గుండె స‌మ‌స్యలు ఉన్నవారు రాత్రి ఎక్కువ నీటిని తాగ‌ వద్దని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మన చ‌ర్మం అందంగా, కాంతివంతంగా ఉండాలంటే నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి. నీటి తాగడం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు తొల‌గిపోతాయి, శరీరంలో వేడి వంటి స‌మ‌స్యలు ఉన్న త‌గ్గుతాయి. అయితే.. రాత్రి సమయంలో నీటిని ఎక్కువ‌గా తాగితే మూత్రవిస‌ర్జన‌కు ఎక్కువ‌గా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో మ‌ననిద్రకు ఆటంకం వస్తుంది. పొట్ట నిండా నీటిని తాగి ప‌డుకుంటే శ్వాస ఇబ్బందులు, గుండెల్లో మంట వంటి ఆనారోగ్య స‌మ‌స్యలు వస్తాయి. అందుకని రాత్రి తాగే నీరు నిద్రకు ఆటంకం లేకుండా, ప‌డుకునే లోపే మూత్రవిస‌ర్జన జ‌రిగేలా చూసుకుంటే మంచిదన వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు