Health Tips: గర్భిణులు యాంటీ బయోటిక్స్ వేసుకోవచ్చా? గర్భిణులు ఇష్టానుసారం యాంటీ బయోటిక్స్ టాబ్లెట్స్ వేసుకుంటే పిండం పెరుగుదలకు ఇబ్బంది కలుగుతుందని వైద్యులు అంటున్నారు. మొదటి మూడు నెలలు యాంటీ బయోటిక్స్‌కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. By Vijaya Nimma 21 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Tips: యాంటీబయాటిక్ మందులు శిలీంధ్రాలు, వైరస్‌లు, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాకుండా మళ్లీ పెరగకుండా చేస్తాయి. అయితే గర్భధారణ సమయంలో ఈ యాంటీబయోటిక్ మందులు వాడాలా వద్దా అనే సందేహం చాలా మందికి కలగడం సహజం. యాంటీబయోటిక్స్ దుష్ప్రభావాలు: యాంటీబయోటిక్స్ వివిధ దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. కొన్నిసార్లు ఇవి పిండం పెరుగుదలకు అడ్డంకి కలిగిస్తాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలలలో యాంటిబయోటిక్స్ వేసుకుంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే గర్భిణులు మూడు నెలలు మామూలు మందులు వేసుకోవాలి. సాధారణంగా 10 శాతం యాంటీబయోటిక్స్ మాత్రమే గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనవిగా వైద్యులు చెబుతున్నారు. వైద్యులు ఏమంటున్నారు?: డాక్టర్‌ను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో సొంతగా యాంటీబయోటిక్స్ వేసుకోవద్దని చెబుతున్నారు.. గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి ఉంటాయి. ఈ సమయంలో స్త్రీలకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి?: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యోని ఇన్ఫెక్షన్, చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్ల విషయంలో వైద్యులు యాంటీబయోటిక్స్ తీసుకోవాలని సలహా ఇస్తారు. బీటా లాక్టమ్, వానోమైసిన్, నైట్రోఫురటైన్, మెట్రోనిడాజోల్, క్లిండామైసిన్, ఫాస్ఫోమైసిన్, ఎన్సెఫాల్, రోసాఫిన్, జెంటామిసిన్, నియోమైసిన్ మొదలైనవి సురక్షితమైనవిగా డాక్టర్లు చెబుతున్నారు. అయితే, వైద్యులను సంప్రదించకుండా ఈ యాంటీబయోటిక్స్ తీసుకోవడం మంచిది కాదు. ఎన్ని రోజులు వాడవచ్చు?: సాధారణ వ్యక్తులు కూడాయాంటీ బయోటిక్స్‌ని ఎక్కువ కాలం వాడకూడదని వైద్యులు అంటున్నారు. పది రోజుల కంటే ఎక్కువ రోజులు యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా శరీరం కూడా నియంత్రణ కోల్పోతుందని వైద్యులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు వాడితేనే ఉత్తమం అని సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: ఈ ప్రదేశాలలో మీ మొబైల్‌ని వాడకండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. " width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"> #pregnancy #pregnancy-diet #pregnancy-care మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి