Life Style : మీరు మొబైల్ ప్రియులా(Mobile Users).. మొబైల్ లేకుండా నిద్ర పట్టడం లేదా, ఎక్కడికి వెళ్లినా మొబైల్ ఫోన్(Mobile Phone) ఉండాల్సిందేనా అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ ఎనిమిది ప్రదేశాలలో ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ను వాడొద్దంటున్నారు నిపుణులు.
పూర్తిగా చదవండి..బెడ్‌రూమ్:
సాధారణంగా అందరూ మొబైల్‌ని పడకగదిలో ఉంచుతారు. మెసేజ్‌లు(Messages) చదవడం, అలారం పెట్టుకోవడం కోసం ఫోన్‌ను పక్కనే పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇది మంచి పరిణామం కాదని గుర్తుంచుకోండి, మొబైల్ తరంగాలు మీ ఆరోగ్యానికి హానికరం.
జేబులో పెట్టుకోవడం:
మీరు మొబైల్‌ని వెనుక లేదా ముందు జేబులో ఉంచుకోవడం చాలా ప్రమాదకరం. ఇది మీ కడుపు నొప్పి లేదా కాలు నొప్పికి కారణమవుతుంది. మొబైల్ ఎప్పుడూ ఇంటర్నెట్(Internet) తో అనుసంధానించబడి ఉండటంతో ఎన్నో తరంగాలను సృష్టిస్తుంది. ఇది మీ శరీరంలోని వివిధ భాగాలకు సమస్యలను కలిగిస్తుంది. అలాగే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
దిండు కింద ఉంచవద్దు:
మొబైల్ ఫోన్‌ని దిండు కింద పెట్టుకోవడం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. అక్కడ వస్తున్న బ్లూ కలర్ లైట్(Blue Light) నిద్రకు భంగం కలిగిస్తుంది. అలాగే మీరు పొద్దున్నే లేవడం కూడా కష్టంగా ఉంటుంది. దీంతో సోమరితనం కూడా పెరుగుతుంది.
చొక్కా జేబులో ఉంచొద్దు:
ఫోన్‌ను చొక్కా జేబులో ఉంచడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్(Breast Cancer) వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వైబ్రేట్ మోడ్‌లో ఉంచడం మరింత ప్రమాదకరం. మీ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, అది దెబ్బతింటుంది.
ముఖానికి దూరంగా:
కాల్స్ రిసీవ్ చేసుకునేప్పుడు ఫోన్‌ను ముఖానికి తగలకుండా చూడాలి. ఎందుకంటే మన ఫోన్లలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మీ ముఖ చర్మంపై ప్రభావం చూపుతుంది. చర్మానికి ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా దురద కూడా మొదలవుతుంది. కాబట్టి ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించండి.
బాత్‌రూమ్‌కి తీసుకెళ్లొద్దు:
మొబైల్‌ని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్తే అక్కడున్న బ్యాక్టీరియా మీ మొబైల్‌లోకి ప్రవేశిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి.
కారు డాష్‌బోర్డుపై:
ఫోన్‌ను కారులోని డాష్‌బోర్డు మీద ఉంచడంతో ఫోన్ పాడవడమే కాకుండా కొన్ని రసాయనాలు ఫోన్‌కు అంటుకుంటాయి.
పిల్లలకు దూరంగా ఉంచండి
మొబైల్స్ పిల్లలకు చాలా హానికరం, రేడియేషన్ తరంగాలు మీ పిల్లల మెదడుపై ప్రభావం చూపుతాయి. అందుకే వారికి దూరంగా ఉంచండి.
ఇది కూడా చదవండి: మీ మూత్రం దుర్వాసన వస్తుందా?..అయితే ఇదే కారణం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
[vuukle]