Heavy Rains: ఏపీ, తెలంగాణకి రెయిన్ అలర్ట్‌.. వాతావరణ శాఖ కీలక ప్రకటన

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడిన కారణంగా శుక్రవారం సాయంత్రం నుంచి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నాయని ప్రకటించింది.

Heavy Rains: ఏపీ, తెలంగాణకి రెయిన్ అలర్ట్‌.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
New Update

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. శుక్రవారం సాయంత్రం నుంచి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

వాతావరణ కేంద్రం హెచ్చరికలు

తెలంగాణలో శుక్రవారం (నేటి) నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది ప్రభుత్వం. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అందువల్ల ఈ 16 జిల్లాల్లో ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్‌ ప్రభుత్వ అధికారులు సూచించింది. భారీ వర్షాలపై హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. అంతేకాకూండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అధిక వర్షపాతం నమోదు

కాగా.. జార్ఖండ్‌ రాష్ర్ట పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటున సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోకి దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్నది. అయితే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కనగల్లో 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఈనెల 25న రాజస్థాన్‌లో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో డిసెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ వర్షకాలం సీజన్‌లో రాష్ట్రంలో 15 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

విస్తారంగా వర్షాలు

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన వాతావరణ శాఖ ఇచ్చింది. విశాఖ Rtvతో వాతావరణ శాఖ అధికారి సునంద వివరాలు వెల్లడించారు. రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌ వద్ద కేద్రీకృతం అయ్యిందన్నారు.

#telangana #ap #heavy-rains #three-days #hyderabad-meteorological-centre #yellow-alert-issued #16-districts #visakha-meteorological-department-officer-sunanda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe