APSRTC గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ పై 10 శాతం డిస్కౌంట్!

సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ‌ఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. రానూపోనూ అడ్వాన్స్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఉంటుందని ప్రకటించింది.

New Update
APSRTC గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ పై 10 శాతం డిస్కౌంట్!

APSRTC Special Buses: సంక్రాంతికి సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికులకు ఏపీ‌ఎస్ ఆర్టీసీ (APSRTC) తీపి కబురు అందించింది. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు (Special Buses) నడుపుతున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఈనెల 14 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. వివిధ ప్రాంతాలకు 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.

సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని తెలిపింది. రానూపోనూ అడ్వాన్స్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ (Discount On Bus Tickets) ఉంటుందని ప్రకటించింది. తిరిగి వెళ్లేవారి కోసం ఈనెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొంది.

ALSO READ: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

తెలంగాణలోనూ ప్రత్యేక బస్సులు..

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ టీఎస్ ఆర్టీసీ కూడా ప్రయాణికుల గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు (Special Buses) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పండుగకు వెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ తెలిపింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెల 7 వ తేదీ నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TSRTC MD Sajjanar) హైదరాబాద్ బస్ భవన్ లో శుక్రవారం ఉన్నతాధికారులు, ఆర్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహా లక్ష్మి స్కీం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు.

ALSO READ:వైసీపీలోకి ఎన్టీఆర్ ఫ్రెండ్.. అక్కడి నుంచే ఎంపీగా స్టార్ డైరెక్టర్ పోటీ?

Advertisment
తాజా కథనాలు