Ayodhya : అయోధ్యలో అపోలో సేవలు..యూపీ సీఎంతో ఉపాసన భేటీ అయోధ్యలో అపోలో సేవలు ప్రారంభం అయ్యాయి. రామ్ రాగ్ సేవ వేడుకలలో చివరి రోజు అయోధ్య రామమందిరాన్ని ఉపాసన తన తాత, అత్తమామలతో కలిసి సందర్శించారు. అప్పుడే భక్తులకు సేవలందించేందుకు ఉపాసన స్వయంగా అపోలో ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. By Manogna alamuru 11 Mar 2024 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి Apollo Hospital Started In Ayodhya : అయోధ్య(Ayodhya) రామ్ రాగ్ సేవలో రామ్‌చరణ్(Ram Charan) భార్య, అపోలో ఆసుపత్రుల(Apollo Hospital) అధినేత్రి ఉపాసన(Upasana) పాల్గొన్నారు. చిరంజీవి, సురేఖ, తాతయ్య తో కలిసి అయోధ్య వెళ్ళారు. వారితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేశారు. దీంతో పాటూ ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్(Uttar Pradesh CM Adityanath) తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు ఉపాసన. రామ మందిర్‌లో 48 రోజులుగా సాగుతున్న రామరాగ్ సేవ మార్చి 10తో ముగిసింది. దీనిలోనే ఉపాసన పాల్గొన్నారు. అయోధ్యకు బయలుదేరడానికి ముందే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన కామినేని కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న ఫోటోను షేర్ చేసింది. దానికి 'అయోధ్య చలో' అనే క్యాప్షన్‌ను కూడా జోడించారు. అలాగే రామమందిరం ముందు ఆమె తన తాతను కౌగిలించుకున్న ఫోటోను కూడా పెట్టింది. దానికి నా హృదయం నిండిపోయింది. ధన్యవాదాలు తాతా! అంటూ రాసి మురిసిపోయింది. ఉపాసన అయోధ్య రాముడిని దర్శించుకోవడమే కాకుండా అక్కడ అపోలో హాస్పిటల్ కొత్త బ్రాంచిని కూడా ప్రారంభించారు. దీని ద్వారా ఆమె తాత ప్రతాప్ రెడ్డి లెగసీని సాగిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కూడా కలుసుకొని.. రాష్ట్రంలో అపోలో సేవల గురించి తెలియజేసారు. తర్వాత తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే 'ది అపోలో స్టోరీ' పుస్తకాన్ని కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) జనవరి 22న అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖ కొణిదెలతో కలిసి హాజరయ్యారు. ఆటైమ్‌లో ఉపాసన రాలేదు. Also Read : National : ఎన్నికల ముందే పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి.. #upasana #ayodhya #ram-charan #apollo-hospitals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి