Lipstick : బుగ్గలకు లిప్‌స్టిక్‌ రాసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

పెదవుల కోసం తయారు చేసిన ప్రొడెక్ట్‌ను ఎక్కడపడితే అక్కడ రాసుకోకూడదు. ఇది చర్మానికి మంచిది కాదు. క్యాన్సర్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లిప్‌స్టిక్‌ ఎంత మంచి బ్రాండ్‌ అయినా సరే చర్మానికి రాయకూడదని వైద్యులు చెబుతున్నారు

New Update
Lipstick : బుగ్గలకు లిప్‌స్టిక్‌ రాసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

Lipstick Tips :మేకప్(Makeup) ఉత్పత్తులను ఎప్పుడూ మహిళలు(Women's) ఇష్టపడతారు. ఎందుకంటే మేకప్‌ ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా అందంగా కనిపించేలా చేయడం, చర్మంలోని లోపాలను కనిపించకుండా చేస్తుంది. ప్రతిరోజూ కొత్త మేకప్ ట్రెండ్‌లు(New Makeup Trends) వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని మహిళలు గుడ్డిగా అనుసరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో లిప్‌స్టిక్‌ను చెంపలపై బ్లష్‌గా ఉపయోగించడం చూస్తున్నాం. ఇలా చేయడం వల్ల మంచిదేనా?, ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?.

బుగ్గలపై లిప్ స్టిక్ వేసుకోవచ్చా?

  • లిప్‌స్టిక్‌(Lipstick) ను బ్లష్‌గా ఉపయోగించే అలవాటును పూర్తిగా మానేయాలని చర్మ వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇది చర్మానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ముదురు రంగు లిప్‌స్టిక్ లేదా లిక్విడ్ మ్యాట్ లిప్‌స్టిక్‌ను బ్లష్‌గా ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది పెదవులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది.
  • బ్లష్ లాగా బుగ్గలపై లిప్ స్టిక్ రాసుకోవడం వల్ల బుగ్గలపై ఉన్న మచ్చలు మరింత నల్లగా మారతాయని వైద్యులు చెబుతున్నారు. బుగ్గలకు పౌడర్ బ్లష్(Powder Blush), లేత రంగు క్రీమ్ బ్లష్ లేదా లేత రంగు చీక్ టింట్ మాత్రమే వాడాలని సలహా ఇస్తున్నారు.

వైద్యుల సలహా:

  • పెదవుల కోసం తయారు చేసిన ప్రొడెక్ట్‌ను ఎక్కడపడితే అక్కడ రాసుకోకూడదని అంటున్నారు. చర్మానికి మంచిది కాదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే మన బాడీలో ఒక్కో భాగం ఒక్కో తీరుతో ఉంటుందని. సున్నితమైన ప్రాంతాల్లో వాడే ప్రొడెక్ట్‌లు అలర్జీలకు కారణం అవుతాయని అంటున్నారు. అంతేకాకుండా క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
  • లిప్ స్టిక్స్‌లు మామూలుగా మైనా, కొన్ని నూనెలు, కలర్స్‌తో తయారు చేస్తారు. వీటి వల్ల ముఖంపై చర్మం పాడయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. లిప్‌స్టిక్‌ ఎంత మంచి బ్రాండ్‌ అయినా సరే చర్మానికి రాయకూడదని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఈ సమస్యలను లైట్‌ తీసుకుంటే కిడ్నీలు పోయే ప్రమాదం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు