iphone Offers: మళ్లీ మళ్లీ రాని ఆఫర్.. సగం ధరకే ఈ ఐఫోన్!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 14పై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్ అందిస్తోంది. కేవలం రూ. 25వేల లోపే ఆపిల్ ఫోన్ను సొంతం చేసుకోవచ్చు.

I phone 15 Sale: ఫ్లిప్ కార్ట్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 15..
New Update

Apple iPhone 15 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత, యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ లాంచ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు, బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసినప్పటికీ, ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు.ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ భారత్ లో రూ. 89,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ లాంచ్ చేసిన తర్వాత, కంపెనీ ఫోన్ పై ఏకంగా 10,000 రూపాయలు తగ్గించింది. ప్రస్తుతం, ఐఫోన్ 14 ప్లస్‌ను రూ. 36,000 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి రూ. 30,999కి కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌:

Apple iPhone 14 Plus ప్రస్తుతం Flipkartలో రూ. 12,901 తగ్గింపు తర్వాత రూ. 66,999 వద్ద సేల్ అవుతోంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఈ ఫోన్‌పై రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు ఆపిల్ ఐఫోన్ 14ప్లస్ ధర రూ. 65, 499వరకు ఆదా అవుతుంది. ఇది కాకుండా కస్టమర్లు తమ పాత స్మార్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే రూ. 34,500వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు బ్యాంకు డిస్కౌంట్స్ తర్వాత కస్టమర్లు యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ లో కేవలం రూ. 30,999కి కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ గతేడాది కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈ ఏడాది ఈ ఫోన్‌కు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కస్టమర్ల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ రాకతో పాత మోడళ్ల ధర తగ్గడం కారణం అయ్యి ఉండోచ్చు.

వినియోగదారులు Apple iPhone 14 Plusని బ్లూ, పర్పుల్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, రెడ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇక ఫోన్ 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో మెరుగైన ఏ15 బాయోనిక్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. ఈ ప్రాసెసర్ యాపిల్ ఐఫోన్ 13 ప్రో మోడల్స్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే, ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా... ఇది 12MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఆపిల్ ప్రకారం, ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 గంటల పాటు నిరంతరంగా ఉపయోగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఈ చలిలోనూ మీ ఫోన్ వేడెక్కుతుంటే డేంజర్.. వెంటనే ఈ 6 పనులు చేసేయండి!

#tech-news #apple #iphone #tech-news-telugu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe