iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రో మోడల్ పై బంపర్ డిస్కౌంట్..ఏకంగా రూ. 56,000..!

యాపిల్ కంపెనీ గతేడాది ఐఫోన్ 15 సిరీస్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లైనప్ లో మొత్తం నాలుగు వేరియంట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వీటిలో ఐఫోన్ 15 ప్రో మోడల్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్టు. ఎంత డిస్కౌంట్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రో మోడల్ పై  బంపర్ డిస్కౌంట్..ఏకంగా రూ. 56,000..!

iPhone 15 Pro: యాపిల్ ఫోన్లకు ఉన్న క్రేజ్ ఇంకే ఫోన్లకు ఉండదు. చాలా మంది ఐఫోన్ వాడాలన్న కోరిక ఉంటుంది. కానీ ధర కారణంగా కొనలేరు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్. ఐఫోన్ 15 ప్రో మోడల్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఫ్లిప్ కార్టులో (Flipkart) ఏకంగా రూ. 56వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఐపోన్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 71,990కే లభిస్తోంది. అన్ని ఆఫర్లు కలిపి చూస్తే సుమారు రూ. 1.35 లక్షలకు విడుదల అయిన ఈ ఫోన్ ధర, పాత సిరీస్ ఐఫోన్ 14 ప్లస్ కంటే తగ్గడం గమనార్హం.

Iphone 15 pro

బ్యాంక్ ఆఫర్లు:
యాపిల్ ఐఫోన్ 15 ప్రో భారత్ లో రూ. 1,34,900 ధరకు విడుదలయ్యింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఈ డివైజ్ రూ. 1,27,900కి అందుబాటులో ఉంది. అంటే ఫ్లాట్ రూ. 6,910 తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 15 ప్రో కొనుగోళ్లపై ఫ్లిప్ కార్ట్ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్ట్ ఈఎంఐ ట్రాన్సక్షన్లపై వినియోగదారులకు రూ. 3000డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 1,24,990కి తగ్గుతుంది.

భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌:
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో మోడల్‌ను భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌కూడా అందుబాటులో ఉంది. కండిషన్‌లో ఉన్న బ్రాండెండ్ ఫోన్‌పై కంపెనీ రూ. 53,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అన్ని బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కలిపి ఐఫోన్ 15 ప్రో ఎడిషన్‌ను రూ. 56,000 డిస్కౌంట్‌తో కేవలం రూ.71,990కి కొనుగోలు చేయవచ్చు. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 14 ప్లస్ధర రూ. 79,900గా ఉంది. అంటే ఫ్లిప్‌కార్ట్ తాజా ఆఫర్లతో దీని కంటే తక్కువే ఐఫోన్ 15 ప్రో మోడల్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: పవర్‌ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు