Elon Musk: ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌ కామెంట్‌ ఎఫెక్ట్‌.. దెబ్బకు ఆగిపోయిన యాడ్స్‌..

ఇజ్రాయెల్-హమస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. యూదు వ్యతిరేక పోస్టుకు ఎలాన్‌ మస్క్‌ మద్దతు తెలపడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో యాపిల్, డిస్నీ వంటి పలు దిగ్గజ సంస్థలు ఎక్స్‌(ట్విట్టర్‌)లో తమ యాడ్స్ నిలివేస్తున్నట్లు ప్రకటించాయి.

Elon Musk: మస్క్ మామకు టెస్లా దెబ్బ మామూలుగా లేదు..రెండు నెలల్లో ఎన్ని లక్షల కోట్లు  కోల్పోయాడంటే.!
New Update

ఇజ్రాయెల్-హమాస్ మధ్య చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌.. గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇటీవల ఎక్స్‌ (ట్విట్టర్‌)లో యూదులకు వ్యతిరేకంగా పోస్టు రావడం.. వాటిల్లో కొన్నింటికి ఎలాన్‌మస్క్‌ మద్దతు పలకడం చర్చనీయాంశమవుతోంది. అయితే మస్క్‌ తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అగ్రరాజ్యానికి చెందిన పలు కీలక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఎక్స్‌లో తమ యాడ్స్ నిలివేస్తున్నామని.. డిస్నీ, యాపిల్‌ వంటి సంస్థలు ప్రకటించాయి.

అలాగే ఇటీవల ఎక్స్‌ వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఉండే యూజర్లతో మస్క్‌ సంభాషణలు జరిపారు. అయితే ఈ క్రమంలోనే యూదులు, శ్వేతజాతీయులను కించపర్చేలా ఓ యూజర్‌ పెట్టిన పోస్టుకు స్పందించిన మస్క్.. సరిగ్గా చెప్పారు అని అనడం తీవ్ర దుమారం రేపింది. వైట్‌హౌస్‌ కూడా దీనిపై స్పందించింది. మస్క్ స్పందించిన తీరు యూదు కమ్యూనిటీని ప్రమాదంలో పడేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మస్క్ చేసిన పనికి కొన్ని దిగ్గజ కంపెనీలు.. ఎక్స్‌లో తమ యాడ్స్ రాకుండా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

Also Read: ఐటీ ఉద్యోగం కోసం వెతుకున్నారా? ఆ స్కిల్ ఉంటే లక్షల్లో జీతం.. ఓ లుక్కేయండి

ఐబీఎం, ఒరికిల్, యాపిల్, డిస్నీ, కామ్‌కాస్ట్, యూరోపియన్‌ కమిషన్స్ వంటి పలు సంస్థలు తమ యాడ్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలాఉండగా మరోవైపు మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీలో కూడా ఆయనపై వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుతం టెస్లా సీఈఓగా ఉన్న మస్క్‌ను ఆ హోదా నుంచి సస్పెండ్‌ చేయాలని కొంతమంది సంస్థ వాటాదారులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: విశ్వసుందరి పోటీల్లో బ్యూటీల అందాలు విందు.. పిచ్చెక్కించే ఫొటొలివే!

#telugu-news #national-news #elon-musk #twitter
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe