Hyderabad : భూములు, ఇళ్ళ స్థలాల కోసం యాప్..

ఔటర్ పరిధిలోని చెరువులకు సంబంధించిన సమాచారంతో ఓ యాప్‌ను తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు హైడ్రా. కమిషనర్ రంగనాథ్. చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది? దాని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ ఎంత వరకు? బఫర్‌ జోన్‌ ఏ మేరకు విస్తరించి ఉంది? అనేవి ఈ యాప్‌లో ఉండనున్నాయి.

New Update
Hyderabad : భూములు, ఇళ్ళ స్థలాల కోసం యాప్..

App For Hydra : హైదరాబాద్‌ (Hyderabad) లో ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూముల విస్తరణ అతి వేగంగా జరగుతోంది. ఇక్కడ ఇళ్ళు, ప్లాట్లు కొనేందుకు ప్రజలు ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. అయితే తాజాగా ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలోని ఆక్రమణలపై అనునిత్యం హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (HYDRA) కొరడా ఝళిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది? దాని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ ఎంత వరకు? బఫర్‌ జోన్‌ ఏ మేరకు విస్తరించి ఉంది? తెలుసుకోవడం ఎలా.. అని సామాన్య మానవులు దిగులు పడుతున్నారు. పెద్ద వ్యక్తులు, బిల్డర్లు, రియల్టర్లకు ఈ సమాచారం ఆలా సులువుగా లభిస్తుంది. కానీ మామూలువారికి మాత్రం ఇది ఎంతో కష్టం . ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ పరిధిలోని చెరువులకు సంబంధించిన సమాచారంతో ఒక ఆప్‌ను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు.

హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులకు సంబంధించిన సమాచారం మొత్తం ఇప్పటికే హెచ్‌ఎండీఏ (HMDA) దగ్గర ఉంది. ప్రతి చెరువు, కుంట, ట్యాంక్‌కు ప్రత్యేక ఐడీ సైతం జారీ చేసింది. దానికి సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్ల లెక్కలతో పాటు వీటిని గుర్తిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ వివరాలనూ సంపాదించింది. ఈ వివరాలన్నింటినీ మ్యాపులతో సహ తమ అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. https://lakes.hmda.gov.in అనే వెబ్ సైట్‌లో అన్ని వివరాలున్నాయి.
అయితే ఇది మామూలు జనాలకు అర్ధమయ్యే విధంగా లేవు. అంతా సాంకేతిక పరిభాషలతో అంకెలతో నిండిపోయి ఉంటుంది. దీంతో ఈ సమాచారం అంతా ఉన్నా ఒకటే లేకపోయినా ఒటే అన్నట్లు అయిపోయింది.

ఇప్పుడు వెబ్ సైట్‌లో ఉన్న సమాచారాన్నే యాప్‌లో సరళ రూపంలో తీసుకురావాలని అనుకుంటోంది హైడ్రా. ఇందులో ఆక్రమణలు సహా వివిధ అంశాలపై ఫిర్యాదులు చేయడానికి వాట్సాప్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీలతో పాటు యాప్‌ను హైడ్రా అందుబాటులోకి తీసుకురానుంది. జియో ట్యాగింగ్ను కూడా ఇందులో పొందు పరచనున్నారు. ఈ యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకుంటే.. ఓ ప్రాంతంలో నిల్చుని యాప్‌ను ఓపెన్‌ చేస్తే.. ఆ ఏరియా ఏదైనా చెరువు, ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్ల కిందికి వస్తుందా? అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రస్తుతం చెరువులతో మొదలుపెట్టి..తర్వాత ప్రభుత్వ భూములు, పార్కుల్లాంటివి కూడా ఇందులోకి తీసకురావాలని అనుకుంటున్నారు.

Also Read: Delhi: డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Advertisment
తాజా కథనాలు